AP Cabinet: రాష్ట్ర రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులకు వేగం పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అమరావతికి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ కేబినెట్ భేటీలో అమరావతిలో 20,494 ఎకరాల భూసేకరణకు అనుమతి ఇవ్వనున్నారు. గతంలో రాజధాని నిర్మాణం కొంతకాలం ఆగిపోయిన నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ అదే ఉత్సాహంతో పనులు మొదలయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
CM Chandrababu : శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన సీఎం చంద్రబాబు
అమరావతిలో నాలుగు అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ సెంటర్లు నిర్మించేందుకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. అలాగే రాజధాని నిర్మాణ పనుల్లో ఉపయోగించేందుకు ఇసుక డీసిల్టేషన్ (desiltation)కు కేబినెట్ ఆమోదం తెలిపే సూచనలు ఉన్నాయి. అమరావతిలో హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. దీనికి సంబంధించి నిబంధనలు, అభివృద్ధి ప్రణాళికలను కేబినెట్ చర్చించి ఆమోదించనుంది.
రాష్ట్ర చరిత్రలో ప్రాధాన్యం ఉన్న అల్లూరి సీతారామరాజు, అమరజీవి పొట్టి శ్రీరాములు గౌరవార్థం అమరావతిలో స్మారక చిహ్నాల నిర్మాణానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అమరావతిలో కొన్ని సంస్థలకు భూములను కేటాయించేందుకు కూడా కేబినెట్ అనుమతి ఇవ్వనుంది. రాష్ట్రంలోని పట్టణ అభివృద్ధి సంస్థల పునర్విభజనపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. కొత్తగా రెండు పట్టణ అభివృద్ధి సంస్థలు ఏర్పాటుకి అనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం.
జిల్లాలవారీగా ‘UDAs’ (Urban Development Authorities) రూపొందించే అంశంపై కూడా చర్చ జరగనుంది. సారాంశంగా చెప్పాలంటే, రేపటి కేబినెట్ భేటీలో అమరావతికి కొత్త ఊపు ఇచ్చే నిర్ణయాలు వెలువడే అవకాశం బలంగా కనిపిస్తోంది. ఈ సమావేశం రాష్ట్ర రాజధానిగా అమరావతిని శాశ్వతంగా బలోపేతం చేసే దిశగా కీలక మలుపుగా నిలవనుంది.
Minister Lokesh : ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది: మంత్రి లోకేశ్