ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2025-26 (AP Budget 2025 -26 )ఆర్థిక సంవత్సరానికిగాను భారీ స్థాయిలో రూ. 3 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. రేపు అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండగా, ఉదయం 9 గంటలకు సీఎం చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో ప్రధాన బడ్జెట్‌ను, మండలిలో కొల్లు రవీంద్ర సమర్పించనున్నారు. అలాగే వ్యవసాయ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ వ్యవసాయ బడ్జెట్‌ను అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.
Anita Anand: కెనడా ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన మహిళ.. ఎవరీ అనితా ఆనంద్?
ఈసారి బడ్జెట్‌లో రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన పలు కీలక రంగాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, వైద్య ఆరోగ్య రంగం, విద్య, ఉపాధి, రవాణా వంటి రంగాలకు పెద్దపీట వేయనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. అలాగే రాష్ట్రంలో ప్రాజెక్టుల అభివృద్ధికి కూడా ఈసారి బడ్జెట్‌లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించనున్నట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్టు, అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణం, రోడ్ల విస్తరణ, మౌలిక వసతుల పెంపు వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం అసెంబ్లీలో దీనిపై చర్చ జరుగనుంది. ప్రభుత్వం ప్రతిపాదించే బడ్జెట్‌పై ప్రజలు, రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
MLC Elections 2025 : తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్