Karthik Naralasetty : అమెరికా రాజకీయాల్లో భారతీయులు సత్తా చాటుకుంటున్నారు. భారత సంతతికి చెందిన ఎంతోమంది డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీలలో నాయకులుగా ఎదుగుతున్నారు. నవంబరు 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి వనిత కమలా హ్యారిస్ పోటీ చేస్తున్నారు. ఆమె డెమొక్రటిక్ పార్టీ తరఫున బరిలోకి దిగారు. మరోవైపు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న ‘ది హిల్స్’ నగర మేయర్ ఎన్నికల్లో మన ఆంధ్రాకు చెందిన యువతేజం కార్తిక్ నరాలశెట్టి (35) పోటీ చేస్తున్నారు. నవంబరు 5న జరిగే ఎన్నికల్లో ఆయన భవితవ్యం తేలిపోనుంది. ఈసందర్భంగా కార్తిక్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
Also Read :Gift To Contractor : రూ.కోటి రోలెక్స్ గడియారం.. ఇల్లు కట్టిన కాంట్రాక్టరుకు గిఫ్టు
- టెక్సాస్ రాష్ట్రంలోని ‘ది హిల్స్’ ప్రాంతంలో కార్తిక్ నరాలశెట్టి(Karthik Naralasetty) నివసిస్తున్నారు. అందుకే అక్కడి నుంచి మేయర్ పదవికి పోటీ చేస్తున్నారు.
- ఈ పదవికి పోటీ చేస్తున్న అతిపిన్న వయస్కుడిగా ఆయన సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు.
- కార్తిక్ ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల వాస్తవ్యుడు.
- ఆయన ఉన్నత విద్య కోసం ఏపీ నుంచి అమెరికాకు వెళ్లారు.
- న్యూజెర్సీలో ఉన్న రట్జర్స్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ కోర్సును కార్తిక్ చేశారు. అయితే ఈ కోర్సును ఆయన మధ్యలోనే ఆపేశారు.
- సోషల్‌బ్లడ్ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను కార్తిక్ ఏర్పాటు చేశారు.
- ది హిల్స్ ప్రాంతంలో ఆయన వ్యాపారవేత్తగా ఎదిగారు. ప్రస్తుతం ఆయన సంస్థలు 21 దేశాల్లో కార్యకలాపాలను సాగిస్తున్నాయి.
- నవంబర్ 5న జరగనున్న దిహిల్స్ నగర మేయర్ ఎన్నికల కోసం ఈ ఏడాది ఆగస్టు నుంచే కార్తిక్ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.
- ది హిల్స్ ప్రాంతం డెవలప్మెంట్ కోసం రాజీలేకుండా పనిచేస్తానని కార్తిక్ అంటున్నారు.
- గత సంవత్సరం టెక్సాస్ రాష్ట్రంలోని స్టాన్‌ఫోర్డ్ మేయర్‌గా భారత సంతతి వ్యక్తి కెన్ మాథ్యూ ఎన్నికయ్యారు. ఈసారి కార్తిక్ కూడా అదే తరహాలో అవకాశం లభిస్తుందో లేదో వేచిచూడాలి.