CM Chandrababu: నిర్మలా సీతారామన్‌తో సమావేశమైన చంద్రబాబు

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు ఈ రోజు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. రాబోయే కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి నిధుల కేటాయింపుపై ఆయన చర్చించినట్లు తెలుస్తుంది. తరువాత సీఎం చంద్రబాబు, కేంద్ర ఆరోగ్య మంత్రి జెపి నడ్డా మరియు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లను కలవనున్నారు

Published By: HashtagU Telugu Desk
Cm Chandrababu

Cm Chandrababu

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అధికారిక పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఢిల్లీలో కేంద్ర మంత్రులతో వరుస భేటీలు జరుపుతున్నారు. తన పర్యటనలో రెండవ రోజు చంద్రబాబు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమై రాబోయే కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి నిధుల కేటాయింపుపై చర్చించారు.

ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబుతో పాటు టీడీపీ ఎంపీలు, ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, చీఫ్ సెక్రటరీ నిరబ్ కుమార్ ప్రసాద్, ఏపీ ఆర్థిక కార్యదర్శి పీయూష్ కుమార్‌లతో పాటు నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. రాష్ట్రంలోని కీలక అభివృద్ధి ప్రాజెక్టులపై చంద్రబాబు నిర్మల సీతారామన్ తో చర్చించినట్లు తెలుస్తుంది.

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం ముగిసిన తరువాత ఆంధ్రప్రదేశ్ అవసరాలపై మరింత చర్చించడానికి సీఎం కేంద్ర ఆరోగ్య మంత్రి జెపి నడ్డా మరియు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లను కలవనున్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులు మరియు మౌలిక సదుపాయాల పురోగతికి అవసరమైన నిధులు మరియు వనరులను సమకూర్చడం కోసం బాబు కేంద్ర పెద్దలతో వరుస భేటీలు అవుతున్నారు.

Also Read: Jagan Mohan Reddy: 3 రోజుల పాటు కడప జిల్లాకు వైఎస్‌ జగన్‌.. రీజ‌న్ ఇదే..!

  Last Updated: 05 Jul 2024, 02:57 PM IST