ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం (TDP Govt) అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు (Ambati Rambabu) తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకునే అరెస్టుల పర్వాన్ని తెరలేపిందని ఆయన ఆరోపించారు. విజయసాయిరెడ్డి (Vijayasaireddy) ఇప్పుడు పూర్తిగా చంద్రబాబు వైపు వెళ్లిపోయారని, ఇప్పుడేమీ భయపడాల్సిన అవసరం లేదని తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
అరెస్టుల వెనుక కుట్రలు ఉన్నాయని ఆరోపణ
ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు చేయడాన్ని అంబటి తీవ్రంగా ఖండించారు. ఆయన ఒక నిజాయితీ గల అధికారి అని, రాజకీయ కక్షలతోనే అరెస్టు చేశారని విమర్శించారు. అలాగే రాజ్ కసిరెడ్డి అరెస్టు కూడా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని అన్నారు. సినీ నటి జత్వాని బ్లాక్ మెయిలర్ అని, ఆమె అరెస్టు చట్టబద్ధంగానే జరిగిందని పేర్కొన్నారు. లోకేశ్ సృష్టించిన ‘ఉర్స్’ సంస్థ ద్వారా వేల కోట్ల ఆస్తులను బదలాయించిన విషయాన్ని దాచేందుకు ఈ అరెస్టులు జరిగాయని ఆరోపించారు.
ప్రస్తుతం హోంమంత్రి, పోలీసు అధికారులు పూర్తిగా లోకేశ్ కనుసన్నల్లో పనిచేస్తున్నారని, గోరంట్ల మాధవ్ వ్యవహారంలో 11 మంది అధికారులను సస్పెండ్ చేయడం తప్పని అన్నారు. దీనికి హోంమంత్రి బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ అక్రమ అరెస్టులకు టీడీపీ ప్రభుత్వం తప్పకుండా ప్రజల ముందు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజలు, దేవుడు త్వరలోనే న్యాయం చేస్తారని అంబటి రాంబాబు పేర్కొన్నారు.
Police Complaint : హెలికాప్టర్ ఎగరడం లేదని పోలీసులకు బుడ్డోడు పిర్యాదు..అసలు ట్విస్ట్ ఇదే !