Amravathi : అమ‌రావ‌తిపై కుట్ర‌కోణం, కేటీఆర్ మాట‌ల్లో..!

తెలంగాణ మంత్రి కేటీఆర్ నోట అమ‌రావ‌తి(Amravathi) నిజాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. వాస్త‌వాల‌ను

  • Written By:
  • Publish Date - March 28, 2023 / 05:58 PM IST

తెలంగాణ మంత్రి కేటీఆర్ నోట అమ‌రావ‌తి(Amravathi) నిజాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. వాస్త‌వాల‌ను త‌న ప్ర‌సంగం ఫ్లోలో సూచాయ‌గా బ‌య‌ట‌పెట్టారు. ఖాజాగూడ వ‌ద్ద కార్పొరేట్ కంపెనీల యాజ‌మాన్యాల‌తో మాట్లాడుతూ అమ‌రావ‌తి మీద ప‌చ్చి నిజాల‌ను బ‌యట పెట్టారు. అమ‌రావ‌తి అభివృద్ధి ప్ర‌స్తుతం ఆగిపోయింది క‌నుక హైద‌రాబాద్ వ‌రల్డ్ నెంబ‌ర్ 1 (Hyderabad)అవుతుంద‌ని ఆశాభావం వ్య‌క్త‌ప‌రిచారు. గ‌తంలోనూ మంత్రి హ‌రీశ్ రావు ఇలాంటి మాట‌ల‌ను వినిపించారు. తెలంగాణ రియ‌ల్ ఎస్టేట్ పెర‌గ‌డానికి కార‌ణం అమ‌రావ‌తి ప్రాజెక్టు కుప్ప‌కూల‌డ‌మేన‌ని పారిశ్రామిక‌వేత్త‌లకు చెప్పారు. అంటే, ఎంత కుట్ర ఏపీ మీద జ‌రుగుతుందో క‌ల్వ‌కుంట్ల కుటుంబం అప్పుడ‌ప్పుడు చెబుతోన్న మాట‌ల ఆధారంగా బోధ‌ప‌డుతోంది. స‌గ‌టు ఆంధ్రుడుకు ఆ మంత్రులు చెప్పే మాట‌ల్లోని ఆంత‌ర్యం ఇప్పుడు తెలుస్తోంది.

తెలంగాణ మంత్రి కేటీఆర్ నోట అమ‌రావ‌తి నిజాలు (Amaravathi)

అమ‌రావ‌తి అర్బ‌న్ డ‌వ‌లెప్మెంట్ అథారిటీ క్రియేట్ అయింది. దాన్ని కొన‌సాగించి ఉంటే ప్ర‌పంచం నెంబ‌ర్ 1 దిశ‌గా అమ‌రావ‌తి ఉండేది అంటూ మంత్రి కేటీఆర్ చెప్ప‌డం గ‌మ‌నార్హం. అక్క‌డ ప్ర‌స్తుతం ప‌నులు జ‌ర‌గ‌డంలేదు కాబ‌ట్టి హైద‌రాబాద్ ప్ర‌పంచ నెంబ‌ర్ 1 దిశ‌గా వెళుతుంద‌ని త‌న ప్ర‌సంగంలో చెప్ప‌డం చూస్తే, వ్యూహాత్మ‌కంగా ఏపీ అభివృద్ధి మీద వేటు ప‌డింద‌ని సామాన్యుడికి సైతం అర్థ‌మ‌వుతోంది.

వాస్త‌వంగా రాజ‌కీయ నేత‌ల ఆస్తులు హైద‌రాబాద్(Hyderabad) లోనే ఉన్నాయి. ప్ర‌త్యేకించి ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆస్తులు 90శాతం హైద‌రాబాద్ చుట్టూ ఉన్నాయ‌ని అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న వ్యాపారాలు కూడా తెలంగాణ కేంద్రంగా జ‌రుగుతున్నాయి. ఆనాడు ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు అమ‌రావ‌తి శంకుస్థాప‌న‌ను నిర‌సిస్తూ దీక్ష చేశారు. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి (Amaravathi) శంకుస్థాప‌న‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా వ‌చ్చారు. ఆ రోజున అమ‌రావ‌తి డిజైన్, భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌ను కేసీఆర్ విన్నారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఢిల్లీ నుంచి మ‌ట్టిని కూడా తీసుకొచ్చారు. సంఘీభావం ప్ర‌క‌టిస్తూ అమ‌రావ‌తి ప్రాజెక్టుకు మ‌ద్ధ‌తు ప‌లికారు. అదంతా ద‌గ్గ‌ర నుంచి గ‌మ‌నించిన కేసీఆర్ అమ‌రావ‌తి ప్రాజెక్టు పూర్త‌యితే ఏమ‌వుతుందో గ్ర‌హించి ఉంటారు. పైగా చంద్ర‌బాబు విజ‌న్ తెలిసిన వాడిగా కేసీఆర్ అప్ర‌మ‌త్తమై ఉంటారు. అందుకే, ఆ ప్రాజెక్టును అడ్డుకోవ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి మ‌ద్ధ‌తు ఇస్తున్నాడ‌ని 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు చెప్పారు. కానీ, ఏపీ ప్ర‌జ‌లు విన‌లేదు. చంద్ర‌బాబు వంగివంగి దండం పెట్టిన‌ప్ప‌టికీ విశ్వ‌సించ‌లేదు.

అమ‌రావ‌తి  ఆగిపోయింది క‌నుక హైద‌రాబాద్ వ‌రల్డ్ నెంబ‌ర్ 1 (Hyderabad)

2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని సీఎం చేయ‌డానికి కేసీఆర్ ప‌డిన తాప‌త్ర‌యం ఏ ఆంధ్రుడూ ప‌డ‌లేదేమో. స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డి చంద్ర‌బాబును అధికారం నుంచి త‌ప్పించ‌గ‌లిగారు. సీన్ క‌ట్ చేస్తే, అమ‌రావ‌తి(Amaravathi) ప్రాజెక్టు పోయింది. సీఆర్డీయే చ‌ట్టాన్ని ర‌ద్దు చేశారు. మూడు రాజ‌ధానులు అంటూ ఏపీతో ఆడుకున్నారు. ఆ భ‌యంక‌ర‌మైన గేమ్ వెనుక కేసీఆర్ కృర‌మైన గేమ్ ఉంద‌ని ఇప్పుడిప్పుడే ఏపీ జ‌నాన్ని ఆలోచింప చేస్తోంది. ఆనాడు చంద్ర‌బాబు చెప్పిన‌ప్ప‌టికీ చెవికి ఎక్కించుకోని ఓట‌ర్లు ఇప్పుడు బాధ‌ప‌డుతున్నారు. పైగా అసెంబ్లీ లోప‌ల‌, వెలుప‌ల ప‌దేప‌దే ఏపీ వెనుక‌బాటును క‌ల్వ‌కుంట్ల కుటుంబం దెప్పిపొడుస్తోంది. అయిన‌ప్ప‌టికీ ఆస్తుల‌న్నీ హైద‌రాబాద్ చుట్టుపక్క‌ల ఉన్నాయి కాబ‌ట్టి అధికారంలో ఉన్న ఎవ‌రూ నోరెత్తి తిరుగు స‌మాధానం కూడా చెప్ప‌డానికి పయ‌త్నించ‌డంలేదు.

Also Read : Amaravathi : ఢిల్లీకి అమ‌రావ‌తి ఉద్య‌మం! భారతీయ కిసాన్ సంఘ్ మ‌ద్ధ‌తు!

తొలి భేటీలోనే జ‌గన్మోహ‌న్ రెడ్డి చేత హైద‌రాబాద్ (Hyderabad) లోని ఏపీ స‌చివాల‌యాన్ని సొంత చేసుకున్నారు. ఆ త‌రువాత మ‌చిలీప‌ట్నం ఓడ‌రేవుకు కూడా టెండ‌ర్ పెట్టారు. కానీ, ఎందుకో ఇంకా ఆ ప్రాజెక్టు వ‌ర్కౌట్ కాలేదు. విద్యుత్ బ‌కాయిలు 6వేల కోట్లు ఇవ్వ‌లేదు. విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం 9, 10 షెడ్యూల్ ఆస్తుల‌ను పంపిణీ చేయ‌లేదు. తెలంగాణ‌లోని ఏపీ ఆస్తులు కొన్ని ల‌క్ష‌ల కోట్ల విలువ చేస్తాయి. వాటికి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి మోక్షం ల‌భించ‌లేదు. ఏపీ మీద క‌క్ష్య‌క‌ట్టిన క‌ల్వ‌కుంట్ల కుటుంబ‌లోని మంత్రులు, సీఎం అమ‌రావ‌తి(Amaravathi) ప్రాజెక్టు గురించి ఇంత‌గా ప్ర‌స్తావిస్తున్నారంటే, ఆ ప్రాజెక్టు విజ‌య‌వంతం అయితే హైద‌రాబాద్ ప‌రిస్థితి ఏమిటో కేసీఆర్ కు అప్పుడే తెలుస‌న్న‌మాట‌. అందుకే, చంద్ర‌బాబు టార్గెట్ కేసీఆర్ చేసిన రాజ‌కీయ వ్యూహం ఫ‌లించింది. జ‌గ‌న్మోహ‌హ‌న్ రెడ్డిని సీఎంగా కూర్చొబెట్టారు. ఇలా కొనసాగితే ఏపీ అభివృద్ధి ఇక దేవుడికే ఎరుక అన్న‌ట్టు మంత్రి కేటీఆర్ తాజాగా అమ‌రావ‌తి మీద చేసిన వ్యాఖ్య‌లు ఉన్నాయ‌న‌డంలో సందేహం లేదు.

Also Read : Amaravathi: అమ‌రావ‌తిపై వైసీపీ ట్విస్ట్‌, `పేద‌ల‌`పై పాలి`టిక్స్`!