చంద్రబాబు అనారోగ్యానికి (Chandrababu Health) గురి కావడం తో ఏసీబీ కోర్ట్ (ACB Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు ఆరోగ్యం రీత్యా తక్షణమే ఆయన గదిలో ఏసీ సౌకర్యం (AC Facility) కల్పించాలని జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది కోర్ట్. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆరోపణలు ఎదురుకుంటూ గత 36 రోజులుగా చంద్రబాబు (Chandrababu) రాజమండ్రి సెంట్రల్ జైల్లో (Rajahmundry Central Jail) రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. గత కొన్నిరోజులుగా విపరీతమైన ఉక్కపోత, అధిక ఉష్ణోగ్రతలతో చంద్రబాబు డీహైడ్రేషన్, అలర్జీతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుకు మెరుగైన వైద్యం అందించాలని కోరుతూ ఆయన లాయర్లు విజయవాడ ఏసీబీ కోర్టు (ACB Court) లో దాఖలు చేసారు. ప్రభుత్వ వైద్యుల సూచనలను జైలు అధికారులు పాటించేలా చూడాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. న్యాయవాదుల పిటిషన్‌పై వాదనలు విన్న ఏసీబీ కోర్టు, తక్షణమే ఏసీ సౌకర్యం కల్పించాలని ఆదేశించింది.
ఇక నిన్న శుక్రవారం చంద్రబాబుకు జైల్లో సరైన వైద్యం అందటంలేదని..వైద్యం అందించటంలో వైసీపీ (YCP) ప్రభుత్వం విఫలమైందంటూ నారా భువనేశ్వరి ఆరోపించారు. చంద్రబాబు ప్రాణాలకు జైల్లో ముప్పు ఉందంటూ నారా బ్రాహ్మణి ఆరోపించారు. ఇలా చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళనగా ఉంది అంటూ కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు విమర్శించారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna) మాట్లాడుతూ.. జైల్లో చంద్రబాబుకు ముప్పు ఉంది అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని , జైల్లో చంద్రబాబుకు ఏసీ వంటి సౌకర్యాలు కల్పించటానికి అదేమన్నా అత్తారిల్లా..? అంటూ సెటైర్లు వేశారు. ఉక్కపోత జైల్లో ఉండే మిగతాఖైదీలకు ఉండదా..? అంటూ ప్రశ్నించారు. ఆయన బరువు తగ్గిపోయారని ప్రచారం చేస్తున్నారు..కానీ ఆయన బరువు ఏమీ తగ్గలేదు పైగా కిలో బరువు పెరిగారు అంటూ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఏసీబీ కోర్ట్ చంద్రబాబు కు ఏసీ సౌకర్యం కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
Read Also : Chandrababu : చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై కోర్టుకెళ్లాలని టీడీపీ నిర్ణయం