Train Dragged Wires : రైల్వే ట్రాక్‌లపై ఉండే విద్యుత్ తీగలలో నిత్యం హైఓల్టేజీ కలిగిన విద్యుత్ ప్రసారం జరుగుతుంటుంది. అంతటి ప్రమాదకరమైన రైల్వే విద్యుత్ తీగలను ఓ రైలు ఇంజిన్ కొంతదూరం వరకు ఈడ్చుకెళ్లింది. వెంటనే అప్రమ్తతమైన రైల్వే సిబ్బంది వాటికి విద్యుత్ సరఫరాను ఆపేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే భారీ ప్రమాదమే జరిగి ఉండేది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్‌పై ఉండే విద్యుత్ తీగలు కొన్ని సడలడంతో ఆ లైను మీదుగా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. విద్యుత్ తీగలను(Train Dragged Wires) సరిచేసే పనులు పూర్తయిన వెంటనే ఆ లైను రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తారు.
Also Read :Allu Arjun Attitude: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యాటిట్యూడ్.. టాలీవుడ్‌కు నష్టమే!
ఎలా జరిగింది ?
తమిళనాడులోని తిరునల్వేలి నుంచి పశ్చిమ్‌బెంగాల్‌లోని పురూలియాకు వెళ్తున్న సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (22606) ఇవాళ తెల్లవారుజామునే విశాఖపట్నం రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ఆ రైలుకు ఇంజిన్‌ను విశాఖపట్నంలో మార్పు చేశారు. మరో ఇంజిన్‌ను రైలుకు బిగించారు. ఆ ఎక్స్‌ప్రెస్ నుంచి తొలగించిన రైలు ఇంజిన్.. రైల్వే ట్రాక్‌పై ఉండే విద్యుత్ తీగలను కొంతదూరం లాక్కెళ్లింది. విశాఖపట్నం రైల్వే స్టేషను సిబ్బంది చొరవతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ సరఫరాను వెంటనే ఆపడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
Also Read :Allu Arjun Jail Again: అల్లు అర్జున్ మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమా? పోలీసులు ఏం చేయబోతున్నారు!
పలు రైళ్ల దారి మళ్లింపు
- కాజీపేట, విజయవాడ సెక్షన్ల మధ్య మోటుమారి జంక్షన్‌లో మూడో లైన్‌ను ప్రారంభించడం, ప్రీ నాన్-ఇంటర్ లాకింగ్ పనులు, నాన్-ఇంటర్ లాకింగ్ పనుల దృష్ట్యా ఎనిమిది రైళ్లు దారి మళ్లించారు.
- ఈ రైళ్లు గుంటూరు-పగిడిపల్లి మీదుగా దారి మళ్లించిన మార్గంలో నడుస్తాయి.
- విశాఖపట్నం- లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్ రైలు(18519) డిసెంబర్ 26 నుంచి జనవరి 8 వరకు మళ్లించిన మార్గంలో నడుస్తుంది. కాజీపేటలో స్టాపేజ్ తొలగించారు.
- విశాఖపట్నం- సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు(20833) జనవరి 8, జనవరి 9 తేదీలలో మళ్లించిన మార్గంలో నడుస్తుంది. స్టాపేజ్‌లు ఖమ్మం టౌన్, వరంగల్‌ను తొలగించారు.
- హైదరాబాద్- షాలిమార్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు(18046) జనవరి 7 నుంచి జవనరి 9 వరకు దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది. భోంగీర్, ఆలేరు, జనగాన్, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం టౌన్ వంటి స్టాప్‌లు తొలగించారు.
- సికింద్రాబాద్- షాలిమార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు(12774) జనవరి 7న దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది. వరంగల్, రాయనపాడులో స్టాపేజ్‌లు తొలగించారు.