Site icon HashtagU Telugu

Black Bommidai Fish : 8 అడుగుల పొడవు నల్ల బొమ్మిడాయి చేప.. రేటు, టేస్టు వివరాలివీ

Black Bommidai Fish Andhra Pradesh

Black Bommidai Fish : అది అచ్చం పాములాంటి చేప. దాని పేరు నల్ల బొమ్మిడాయి. సముద్రంలో పెరిగే ఈల్​ జాతి చేప ఇది. ఆంధ్రప్రదేశ్​లోని కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారుల వలకు ఈ చేప చిక్కింది. ఇది 8 అడుగుల పొడవు ఉంది.  కాకినాడలోని కుంభాభిషేకం చేపల రేవు వద్ద 50 కిలోల బొమ్మిడాయి (ఈల్​ చేపలు) చేపలను రూ.5000కు మత్స్యకారులు విక్రయించారు. ఈల్​ జాతికి చెందిన చేపలు మూడు నుంచి నాలుగు అడుగుల వరకు పెరుగుతాయి. ఈల్​ చేపల రుచి అమోఘంగా ఉంటుంది. కానీ ఇవి చూడటానికి పాముల్లా ఉండటంతో చాలా మంది తినేందుకు భయపడతారు.ఈ చేపలను ఎండబెట్టి వివిధ దేశాలకు ఎగుమతి(Black Bommidai Fish) చేస్తారు.

Also Read :5000 Shooters : లారెన్స్‌ను చంపేందుకు 5వేల మంది షూటర్లు : యువకుడి వార్నింగ్ వీడియో వైరల్

కొమ్ముసొర చేప  దాడిలో..

కొమ్ముసొర చేప  దాడిలో ఇటలీ మహిళ జూలియా మన్‌ఫ్రిని (36) మరణించింది. ఆమె ఇటలీలోని టురిన్‌ వాస్తవ్యురాలు. ఈ ఘటన జరగడానికి ముందు ఆమె ఇండోనేషియాలోని పశ్చిమ సుమత్రా ప్రావిన్స్‌లోని మెంటావై ఐలాండ్స్ రీజెన్సీ దగ్గర సర్ఫింగ్ చేసింది. కొమ్ముసొర చేప దాడి చేసిన వెంటనే జూలియా మన్‌ఫ్రినికి ప్రాథమిక చికిత్స అందించారు. జూలియాను కాపాడటానికి ఆమె భర్త, స్థానిక రిసార్ట్ సిబ్బంది, వైద్యులు ఎంత ప్రయత్నించినా కాపాడలేకపోయారు.

Also Read :Diwali Crackers : ఆ సమయంలోనే క్రాకర్స్ కాల్చాలంటూ పోలీసుల హెచ్చరిక