Site icon HashtagU Telugu

Rape : ఏపీలో మరో దారుణం..6 ఏళ్ల బాలికపై 65 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం

Woman guard dies after being rape

Woman guard dies after being rape

ఏపీలో ప్రభుత్వం (AP NDA Govt) మారినప్పటికీ అత్యాచారాలు (Rape ) మాత్రం ఆగడం లేదు..మూడు రోజులక్రితం మూడో తరగతి చదువుతున్న బాలిక ఫై ముగ్గురు మైనర్ బాలురులు అత్యాచారం చేసి చంపేసిన ఘటన గురించి ఇంకా మాట్లాడుకుంటుండగానే మరో దారుణం వెలుగులోకి వచ్చింది. 6 ఏళ్ల బాలికపై 65 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం (65 year old man raped a 6 year old girl) చేసిన ఘటన తిరుపతి లో చోటుచేసుకుంది.

We’re now on WhatsApp. Click to Join.

పోలీసులు తెలిపిన ప్రకారం..

తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మూలకండ్రిగలో రోజులాగే గత ఆదివారం తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లారు. అయితే ఇంటి దగ్గర ఒంటరిగా ఆడుకుంటున్న బాలికతో మెళ్లగా మాటలు కలిపిన బలరామయ్య (65) అనే వృద్దుడు చాక్లెట్ ఇప్పిస్తానని నమ్మించి తన వెంట తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశాడు. అంతటితో ఆగకుండా ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి బాలికను ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్లిపోయాడు.

ఈ క్రమంలో నొప్పితో బాధపడుతున్న బాలికను తల్లిదండ్రులు స్థానిక ఆర్.ఎం.పి డాక్టర్ దగ్గర చూపించగా కుదుటపడలేదు. రెండు రోజులైనా నొప్పి తగ్గక పోవటంతో రేణిగుంటలోని ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు బాలికపై లైంగిక దాడి జరిగినట్లు గుర్తించారు. ఆ బాలికను ఏంజరిగిందని అడుగగా..జరిగిన విషయం తెలిపింది. వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసారు. ప్రస్తుతం బలరాయమ్మ పరారీలో ఉన్నాడు. అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇలా వరుస ఘటనల పట్ల వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అధికారంలోకి రాగానే అదిచేస్తాం..ఇది చేస్తామంటూ మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసారని..మహిళలకు , పసి బిడ్డలకు రక్షణ అనేది లేకుండా పోయిందని విమర్శలకు దిగారు.

Read Also : Aasara Pension : ఆసరా పెన్షన్లు వెనక్కి..! – ఇదేం పద్ధతి రేవంత్ రెడ్డి