2025 లో కూటమి ప్రభుత్వం సాధించిన 60 విజయాలు !

AP Kutami Govt : 2025లో కూటమి ప్రభుత్వ విజయాలు.. 1. సూపర్ సిక్స్ పథకాల సూపర్ హిట్ 2. తల్లికి వందనం : రూ.10,090 కోట్లు చెల్లింపు, 67.27 లక్షల మంది విద్యార్ధులకు సాయం 3. స్త్రీ శక్తి : ఆగస్ట్ 15 నుంచి పథకం ప్రారంభం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం… ఇప్పటి వరకు 3.25 కోట్ల ప్రయాణాలు. ఇప్పటి వరకు ఈ పథకానికి రూ.1,144 కోట్ల వ్యయం. 4. దివ్యాంగులకు ఉచిత బస్సు […]

Published By: HashtagU Telugu Desk
Kutami Govt

Kutami Govt

AP Kutami Govt : 2025లో కూటమి ప్రభుత్వ విజయాలు..

Kutami Govt..

1. సూపర్ సిక్స్ పథకాల సూపర్ హిట్

2. తల్లికి వందనం : రూ.10,090 కోట్లు చెల్లింపు, 67.27 లక్షల మంది విద్యార్ధులకు సాయం

3. స్త్రీ శక్తి : ఆగస్ట్ 15 నుంచి పథకం ప్రారంభం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం… ఇప్పటి వరకు 3.25 కోట్ల ప్రయాణాలు. ఇప్పటి వరకు ఈ పథకానికి రూ.1,144 కోట్ల వ్యయం.

4. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం. వీరు ఎక్కడైనా పింఛను తీసుకునే అవకాశం

5. అన్నదాత సుఖీభవ : 46 లక్షల మంది రైతులకు… రూ.6,310 కోట్లు రైతుల ఖాతాలో జమ

6. దీపం–2 : ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు, రూ.2,684 కోట్లు, ఇప్పటికి దాదాపు 2 కోట్ల సిలిండర్ల పంపిణీ

7. ఎన్టీఆర్ భరోసా : ఇప్పటివరకు రూ.50,000 కోట్లకు పైగా పెన్షన్ల కోసం వ్యయం… ఏడాదిలో రూ.33,000 కోట్లు పంపిణీ, నెలకు రూ.2,750 కోట్లు

8. మత్స్యకార భరోసా ఏడాదికి 20 వేల చొప్పున 1.25 లక్షల మందికి రూ.250 కోట్లు

9. నేతన్నలకు ఉచిత విద్యుత్ : మర మగ్గాలకు నెలకు 500 యూనిట్లు, మగ్గాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్

10. ఆటో డ్రైవర్ల సేవలో : ఏడాదికి రూ.15,000… రూ.436 కోట్లు జమ, 2.90 లక్షల మందికి లబ్ది

11. అన్నా క్యాంటిన్ : 204 అన్నా క్యాంటిన్లు. ఇప్పటి వరకు 4 కోట్ల భోజనాలు

12. గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపు

13. వివాదాలకు తావివ్వకుండా ఎస్సీ వర్గీకరణ – స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు

14. ఈ ఏడాది మైనారిటీ సంక్షేమానికి రూ. 3,670 కోట్లు వ్యయం.

15.8,427 మంది పాస్టర్లకు నెలకు రూ.5,000 చొప్పున గౌరవ వేతనం రూ.51 కోట్లు

16. ఇమామ్ లకు నెలకు రూ.10,000 మౌజన్లకు రూ.5,000 చొప్పున ఏడాదికి రూ.90 కోట్లు

17. పురోహితులకు నెలకు రూ.15,000కు వేతనాల పెంపు నాయీ బ్రాహ్మణులకు నెలకు రూ.25,000కు వేతనాల పెంపు

18. జూనియర్ లాయర్లకు రూ.10,000 గౌరవ వేతనం- మహిళలకు లక్ష కుట్టు మిషన్ల పంపిణీ

19. మెగా డీఎస్సీ… ముఖ్యమంత్రి తొలి సంతకం. 15,941 టీచర్ పోస్టుల భర్తీ

20.5,757 కానిస్టేబుల్ పోస్టుల నియామకం పూర్తి, రూ.4,500 నుంచి రూ.12,500కు స్టైఫండ్ పెంపు

21. అంగన్వాడి కార్యకర్తలు, ఆశాలకు గ్రాట్యుటీ అమలు బాలింతలకు ఎన్టీఆర్ బేబీ కిట్లు

22. దాదాపు 84 లక్షల టన్నుల చెత్త తొలగింపు. ప్రతీ నెల ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర’. డోర్ టు డోర్ కలెక్షన్

23.రూ.1,000 కోట్లతో రోడ్ల మరమ్మతులు. మరో రూ.3,000 కోట్లతో రహదారుల నిర్మాణం

24. కొత్తగా 23 పాలసీలు, పరిశ్రమలకు రాయితీలకు దేశంలో తొలి సారి ఎస్రో ఖాతాలు

25. సీఐఐ సమ్మిట్ 610 ఒప్పందాలు. రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు, 16.13 లక్షల ఉద్యోగాలు

Kutami Govt…

26.13 ఎస్ఐపీబీ సమావేశాల్లో రూ.8.55 పెట్టుబడులు, 8.23 లక్షల ఉద్యోగాలు

27.175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు, వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్

28.విశాఖ ఐటీ హబ్, గూగుల్ రిలయన్స్ డేటా సెంటర్, టీసీఎస్ ప్రారంభం, కాగ్నిజెంట్కు శంకుస్థాపన

29. క్వాంటం వ్యాలీకి తొలి అడుగు, అమరావతి పనులు వేగవంతం

30. తిరుమల సహా దేవాలయాల సేవల్లో పెనుమార్పులు, 15 ప్రధాన ఆలయాల్లో నిత్యాన్నదానాలు

31. విశాఖలో యోగాంధ్ర నిర్వహణ.., కర్నూలులో సూపర్ జీఎస్టీ సభ సక్సెస్

32. పీపీపీ విధానంలో పేద విద్యార్ధులకు అదనంగా 110 వైద్య విద్య సీట్లు

33.గాడిలో పంచాయతీరాజ్ వ్యవస్థ. పల్లెపండుగ ద్వారా గ్రామాల్లో 4,000 కి.మీ. రోడ్ల నిర్మాణం

34. రాష్ట్రమంతటా ఒకే రోజు 13,326 గ్రామ సభల నిర్వహణ, దాదాపు 3 వేల పనులకు శ్రీకారం

35. అడవితల్లి బాటతో గిరిజన తండాలకు రోడ్ల నిర్మాణం, శివారు గ్రామాలకు 4జీ నెట్వర్క్

Kutami Govt Naralokesh

36.పంచాయతీ రాజ్ వ్యవస్థలో పదోన్నతులు, 15వ ఆర్ధిక సంఘం నిధుల విడుదల, 95 సీఎస్ఎస్ పథకాల పునరుద్దరణ

37.రాష్ట్రానికి కుంకీ ఏనుగులు. ప్రతీ ఇంటికి అమరజీవి జలధార పేరుతో మంచినీటి కుళాయి కనెక్షన్లు. రూ.3,050 కోట్లతో ప్రాజెక్ట్కు రూపకల్పన, 1.21 కోట్ల మంది దాహార్తిని తీర్చాలని లక్ష్యం.

38.100 రోజుల్లోనే హంద్రీనీవా కాలువ విస్తరణ – చెరువులు, ప్రాజెక్టులు నింపి రాయలసీమకు సాగునీరు

39. సమర్థ నీటి నిర్వహణతో 6.08 మీటర్లకు పెరిగిన భూగర్భ జలాలు

40.పోలవరం పనుల్లో పురోగతి, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లింపులు- వేగంగా వెలిగొండ పనులు

41. రికార్డ్ స్థాయిలో ధాన్యం సేకరణ, 24 గంటల్లో జమ. ఈ ఖరీఫ్ సీజన్లో 34.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ, 5.48 లక్షల మంది రైతులకు రూ.8,120 కోట్లు జమ

42. మార్కెట్ ఇంటర్వెన్షన్- పొగాకు, మామిడి, కోకో, ఉల్లి సహా పంటలకు రూ.1,100 కోట్లకు పైగా సాయం

43. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి డబుల్ డిజిట్ గ్రోత్ 11.28 శాతం…. పెరిగిన మూలధన వ్యయం

44. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు, రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు, నాలా చట్టం రద్దు

45. ఇళ్లు లేని పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఉచితంగా స్థలం, దరఖాస్తుల స్వీకరణ పూర్తి

46. గేట్స్ ఫౌండేషన్, టాటా సంజీవనితో… డిజి హెల్త్ కేర్, యూనివర్సల్ హెల్త్ పాలసీ

47. విద్యా వ్యవస్థలో పెనుమార్పులు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్

48. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్, పారదర్శకంగా బదిలీలు

49.1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 75 లక్షల విద్యార్థులకు హెల్త్ చెకప్, విద్యార్థుల్లో పరిశుభ్రత, ఆరోగ్యకరమైన అలవాట్లు పెంచేలా ‘ముస్తాబు’ కార్యక్రమం

50.గాడిన పడిన విద్యుత్ రంగం – ట్రూ డౌన్ కు అంకురార్పణ. విద్యుత్ కొనుగోళ్ల ధరలు తగ్గించేలా కార్యాచరణ… ప్రస్తుతం ఉన్న యూనిట్ ధర రూ.5.19 నుంచి రూ.4.80కు తగ్గేలా చర్యలు

Kutami Govt….

51. క్లీన్ ఎనర్జీ ప్లాంట్ల స్థాపనకు రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు.

52.20 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సోలార్ రూఫ్ టాప్ బీసీలకు రూ.20 వేల అదనపు సాయం

53. తగ్గిన క్రైమ్ రేట్, గంజాయి – డ్రగ్స్ అరికట్టాం, ఈగల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు

54. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్, వాట్సప్ గవర్నెన్స్, డేటా డ్రివెన్ డెసిషన్స్, విపత్తుల నిర్వహణ, పీ4

55.విశాఖపట్నం, అమరావతి, తిరుపతి కేంద్రంగా 3 రీజియన్ల అభివృద్ధి

56. పూర్వోదయ పథకంలో రాష్ట్రానికి దక్కిన చోటు- విశాఖ రైల్వేజోన్ ప్రధాన కార్యాలయం పనులు

57. కేంద్రంతో సమన్వయం, దాదాపు 90 కేంద్ర పథకాల పునరుద్దరణ, మోదీ గారి సహకారం

58. రాష్ట్రానికి సెమీ కండక్టర్ పరిశ్రమలు స్టీల్ ప్లాంట్ కు రూ.11440 కోట్లతో కేంద్ర ఊతం

59. లక్ష కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టులు.

60.కొత్తగా మరో రెండు జిల్లాల ఏర్పాటుకు ప్రజామోదం, 26 నుంచి 28కి పెరగనున్న జిల్లాల సంఖ్య.

Kutami Govt.

  Last Updated: 29 Dec 2025, 05:03 PM IST