Aghori Weds Varshini: లేడీ అఘోరీ శ్రీనివాస్‌తో తనకు పెళ్లి జరిగిందని మంగళగిరి యువతి 23 ఏళ్ల శ్రీవర్షిణి వెల్లడించింది. రెండు నెలల క్రితం మంగళగిరికి వచ్చిన అఘోరీ.. కాజా టోల్ ప్లాజా వద్ద బట్టలు లేకుండా రచ్చ చేసింది. దీంతో శ్రీవర్షిణి బట్టలు తీసుకెళ్లి అఘోరీకి ఇచ్చింది. ఆ తర్వాత తమ ఇంటికి అఘోరీని తీసుకెళ్లింది. గత నెలలో శ్రీవర్షిణిని తీసుకొని పారిపోయిన లేడీ అఘోరీ, ఆమెను విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో పెళ్లి చేసుకుందనే ప్రచారం జరుగుతోంది. వీరిద్దరు వివిధ రాష్ట్రాలు తిరుగుతూ తాజాగా గుజరాత్ రాష్ట్ర పోలీసులకు దొరికారు. దీంతో శ్రీవర్షిణి తల్లిదండ్రుల్ని మంగళగిరి నుంచి పిలిపించి, వారికి ఆమెను అప్పగించారు. అయితే అఘోరీతో(Aghori Weds Varshini) తనకు పెళ్లి జరిగిపోయిందని శ్రీవర్షిణి చెప్పడం అందరినీ షాక్‌కు గురిచేసింది.
Also Read :Mark Zuckerberg : చైనా చేతిలో ఫేస్‌బుక్, ఇన్‌స్టా, వాట్సాప్.. సంచలన ఆరోపణలు
అఘోరీ మగాడు కాకపోయినా, అతడే నా భర్త : వర్షిణి
తాజాగా ఒక టీవీ స్డూడియోలో దర్శనమిచ్చిన వర్షిణి.. తన మనసుకు అఘోరీ నచ్చాడని చెప్పింది. అందుకే తాళి కట్టించుకున్నానని వెల్లడించింది. ‘‘ఆ అఘోరీ మగాడు కాకపోయినా, సంసార సుఖం ఇవ్వలేకపోయినా.. నా మనసులో అతడే భర్త’’ అని వర్షిణి చెప్పింది. తన తల్లిదండ్రులు తమతో ఉండొచ్చని, తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొంది. తాను మాత్రం అఘోరీని వదిలేది లేదని స్పష్టం చేసింది.
భార్యాభర్తల హక్కులు పొందుతాను : అఘోరీ
ఇదే అంశంపై స్పందించిన అఘోరీ.. ‘‘నాకు వర్షిణితో పెళ్లి జరిగాక.. పది రోజుల పాటు వివిధ గుడులు దర్శించుకున్నాం. ఇప్పుడు కాశీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నాను. పోలీస్ స్టేషనులో చట్ట ప్రకారం అన్ని అనుమతులు తీసుకొని భార్యాభర్తల హక్కులు పొందుతాను’’ అని ప్రకటించాడు. వర్షిణితో లేడీ అఘోరీ పెళ్లిపై హిందూ సంఘాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి.