ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మృతికి నివాళిగా ఏపీ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. రేపు, ఎల్లుండి సంతాప దినాలుగా ప్రకటిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రామోజీరావు (Ramojirao).. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈయన మృతి పట్ల యావత్ ప్రజానీకం దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తుంది.
ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం రేపు రామోజీ రావు అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరపబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి సీఎం రేవంత్ సీస్ కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇటు ఏపీ ప్రభుత్వం సైతం రామోజీరావు మృతికి నివాళిగా ఏపీ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. రేపు, ఎల్లుండి సంతాప దినాలుగా ప్రకటిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
కొద్దీ సేపటి క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు-భువనేశ్వరి దంపతులు రామోజీ ఫిలిం సిటీలో రామోజీరావు పార్థివదేహానికి నివాళులు అర్పించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఫిలింసిటీకి చేరుకున్నారు. రామోజీరావు కుటుంబసభ్యులను ఓదార్చారు. మార్గదర్శి, ఈనాడు, ఈటీవీ, ఫిలింసిటీ సహా అనే వ్యవస్థల నిర్మాణంతో తెలుగుజాతికి ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. అలాంటి మహాయోధుడి మరణం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు.
రామోజీరావు మరణం చాలా బాధాకరమన్న చంద్రబాబు ఆ వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. సమాజహితం కోసమే అనునిత్యం కష్టపడ్డారని, తెలుగుజాతి కోసం అహర్నిశలు పనిచేశారని తెలిపారు. రామోజీరావు ఒక వ్యక్తి కాదు, వ్యవస్థ అని కొనియాడారు. చిత్రపరిశ్రమకు ఎనలేని సేవలు చేశారన్న చంద్రబాబు ధర్మం ప్రకారం పనిచేస్తానని రామోజీరావు స్పష్టంగా చెప్పేవారని గుర్తుచేసుకున్నారు. రామోజీరావు నిర్మించిన వ్యవస్థలు శాశ్వతమని, అత్యున్నత ప్రమాణాలతో రామోజీ ఫిల్మ్‌సిటీ స్థాపించారని పేర్కొన్నారు.
Read Also : Padi Kaushik : పొన్నం ప్రభాకర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి – ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి