Ukraine Vs Russia : ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక ప్రకటన చేశారు. రష్యా సరిహద్దుల్లోని కర్స్క్ ప్రాంతంలో ఉన్న 74 సెటిల్‌మెంట్ ఏరియాలను తాము స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఆయా ప్రాంతాలపై తమ సైన్యం పట్టు సాధించిందని ఆయన తెలిపారు. రష్యా ఆర్మీ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్నా తమ దళాలు ముందుకే దూసుకుపోతున్నాయని చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join
ఉక్రెయిన్ మిలిటరీ చీఫ్ ఒలెగ్జాండర్ సిర్స్కీతో తన వీడియో కాల్‌ను జెలెన్ స్కీ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ‘‘అంతకుముందు రోజు రష్యాలోని 40 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఉక్రెయిన్ ఆర్మీ ఆక్రమించింది. తాజాగా ఇవాళ మరో 3 కిలోమీటర్ల ఏరియాను అదుపులోకి తెచ్చుకున్నాం’’ అని ఉక్రెయిన్ మిలిటరీ చీఫ్ చెబుతుండటం ఆ వీడియోలో కనిపిస్తుంది. ఇప్పటివరకు రష్యాలోని మొత్తం 1000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఉక్రెయిన్ దళాలు(Ukraine Vs Russia) ఆక్రమించాయి.
Also Read :Best Upcoming Cars : రూ.10 లక్షలలోపు బడ్జెట్.. త్వరలో విడుదలయ్యే మూడు బెస్ట్ కార్స్
గత రెండేళ్లుగా ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఉన్నట్టుండి ఉక్రెయిన్ ఆర్మీ బలపడింది. అమెరికా, నాటో దేశాల నుంచి అందుతున్న సైనిక సాయం వల్లే ఈ పరిణామం చోటుచేసుకుంది. అనూహ్యంగా రష్యా సరిహద్దుల్లోని చాలా భూభాగాలను ఆక్రమించుకునే దిశగా ఉక్రెయిన్ దళాలు కదులుతున్నాయి. దీనిపై ఎప్పటికప్పుడు రష్యా సైనిక ఉన్నతాధికారులతో స్వయంగా పుతిన్ సమీక్షిస్తున్నారు. ఉక్రెయిన్ బలగాల చొరబాటుపై పుతిన్ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. రష్యా, ఉక్రెయిన్ భీకర దాడులు చేసుకుంటుండటంతో కస్క్ ప్రాంతం నుంచి దాదాపు లక్ష మంది పౌరులు అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని కాలం వెళ్లదీస్తున్నారు. తమ ప్రాంతాలను ఉక్రెయిన్ ఆర్మీ నుంచి స్వాధీనం చేసుకునే స్పెషల్ ఆపరేషన్లను ప్రారంభించిన రష్యా ఆర్మీ.. ఆయా ప్రాంతాల్లో ఎమర్జెన్సీని అమలు చేస్తోంది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సూచిస్తోంది.