Hezbollah : లెబనాన్ రాజధాని బీరుట్ దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. హిజ్బులా చీఫ్ హసన్ నస్రల్లా కుమార్తె జైనబ్ నస్రల్లా ఈ దాడిలో చనిపోయారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరోవైపు హసన్ నస్రల్లా ఆచూకీ కూడా తెలియరావడం లేదు. ఆయనతో హిజ్బుల్లా మిలిటెంట్లకు కమ్యూనికేషన్ కట్ అయిందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈవిషయాన్ని హిజ్బులా వర్గాలు ధ్రువీకరించడం లేదు. హసన్ నస్రల్లా (Hezbollah) సేఫ్‌గానే ఉన్నారని అంటున్నారు. ఒకవేళ హసన్ నస్రల్లా కుమార్తె చనిపోయిన వార్తలే నిజమైతే.. తదుపరిగా ఇజ్రాయెల్‌పైకి హిజ్బుల్లా మరింత లాంగ్ రేంజ్ కలిగిన మిస్సైళ్లను ప్రయోగించే అవకాశం ఉంది. ఏకంగా ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ లక్ష్యంగా హిజ్బుల్లా దాడులు జరగొచ్చని అంచనా వేస్తున్నారు.
Also Read :Death Penalty : నేరం రుజువైతే కోల్‌కతా కాలేజీ మాజీ ప్రిన్సిపాల్‌కు మరణశిక్ష: సీబీఐ కోర్టు
1997లో ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన వైమానిక దాడుల్లో హసన్ నస్రల్లా సోదరుడు హాదీ హతమయ్యారు. ఇప్పుడు కుమార్తె జైనబ్ కూడా చనిపోవడం అనేది హసన్ నస్రల్లాకు తీరని లోటు. ఇటీవలే జైనబ్ నస్రల్లా మాట్లాడుతూ.. తమ కుటుంబాలకు లెబనాన్ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ప్రాణ త్యాగాలకు వెనకాడదని చెప్పారు. గతంలో పలుమార్లు హసన్ నస్రల్లా కూడా ఇదేవిషయాన్ని తేల్చి చెప్పారు. మొత్తం మీద ఈ మరణాలతో ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా పోరు మరింత పదునెక్కే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇటీవలే ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హిజ్బుల్లా మిస్సైల్ యూనిట్ అధిపతి మహ్మద్ అలీ ఇస్మాయిల్, ఈ విభాగం డిప్యూటీ హెడ్ హుస్సేన్ అహ్మద్ ఇస్మాయిల్ చనిపోయారు. దీంతో హిజ్బుల్లా మిస్సైల్స్ ప్రయోగించే విభాగం బలహీనపడింది. ఇజ్రాయెల్ ఆర్మీ కచ్చితమైన సమాచారంతోనే హిజ్బుల్లా కీలక నేతలపై ఈ దాడులు చేస్తోందని తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్‌లోని సామాన్య ప్రజల ఇల్లు బూడిదకుప్పలుగా మారుతున్నాయని ఆ దేశ టీవీ ఛానళ్లలో వార్తలు ప్రసారమవుతున్నాయి.
Also Read :Jama Masjid : జామా మసీదు వ్యవహారం.. మన్మోహన్ సింగ్ సంతకం చేసిన ఫైల్ ఏమైంది ?: హైకోర్టు
బీరుట్ వదిలి వెళ్లిపోండి.. ఇజ్రాయెల్ ఆర్మీ వార్నింగ్
లెబనాన్ రాజధాని బీరుట్‌పై దాడులను తీవ్రతరం చేసిన ఇజ్రాయెల్ ఆర్మీ ‘ఎక్స్’ వేదికగా ఒక వీడియో సందేశాన్ని విడుదల చేసింది. ‘‘బీరుట్ ప్రజలు వెంటనే ఆ నగరాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలి’’ అని అల్టిమేటం ఇచ్చింది. తమ టార్గెట్ సామాన్య ప్రజలు కాదని.. హిజ్బుల్లా మిలిటెంట్ల కోసం మాత్రమే తాము ఈ సైనిక ఆపరేషన్ నిర్వహిస్తున్నామని ఇజ్రాయెలీ ఆర్మీ తేల్చి చెప్పింది.