YouTuber: వరల్డ్ నంబర్ 1 యూట్యూబర్ దాతృత్వం.. సొంత ఖర్చుతో 1000 మందికి కంటి సర్జరీలు

ప్ర‌పంచంలోనే ఎక్కువ మంది సబ్‌స్క్రైబ‌ర్స్ ఉన్న అమెరికన్ యూట్యూబర్ (YouTuber) మిస్టర్ బీస్ట్ (జిమ్మీ డొనాల్డ్‌సన్) దాతృత్వాన్ని చాటుకున్నాడు. అతను 1,000 మంది పాక్షిక అంధత్వం ఉన్నవాళ్లకు శస్త్రచికిత్స చేయించుకునేందుకు ఆర్ధిక సాయం చేశాడు. వాళ్ళ కంటిశుక్లం శస్త్రచికిత్స కోసం హెల్ప్ చేశాడు.

  • Written By:
  • Updated On - February 1, 2023 / 01:55 PM IST

ప్ర‌పంచంలోనే ఎక్కువ మంది సబ్‌స్క్రైబ‌ర్స్ ఉన్న అమెరికన్ యూట్యూబర్ (YouTuber) మిస్టర్ బీస్ట్ (జిమ్మీ డొనాల్డ్‌సన్) దాతృత్వాన్ని చాటుకున్నాడు. అతను 1,000 మంది పాక్షిక అంధత్వం ఉన్నవాళ్లకు శస్త్రచికిత్స చేయించుకునేందుకు ఆర్ధిక సాయం చేశాడు. వాళ్ళ కంటిశుక్లం శస్త్రచికిత్స కోసం హెల్ప్ చేశాడు. ఇందులో భాగంగా మొదటి రౌండ్ శస్త్రచికిత్సలను ఫ్లోరిడాలోని జాక్సన్‌విల్లేలో నేత్ర వైద్యుడు జెఫ్ లెవెన్సన్ నిర్వహించారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను రెండు రోజుల క్రితం మిస్టర్ బీస్ట్ యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. దీనికి ఇప్పటికే 5.6 కోట్ల వ్యూస్ వచ్చాయి. పాక్షిక దృష్టితో ప్రపంచంలో 200 మిలియన్ల మంది ఉన్నారని వీడియోలో వివరించాడు. తనవంతుగా 1000 మంది సర్జరీ కోసం హెల్ప్ చేశానని చెప్పాడు. “ప్రపంచంలో అంధత్వంతో బాధపడుతున్న వారిలో సగం మందికి 10 నిమిషాల శస్త్రచికిత్సతో కంటిచూపు పోయే రిస్క్ తగ్గిపోతుంది” అని మిస్టర్ బీస్ట్  వివరించారు.ఈ వీడియోలో కంటి సర్జరీకి ముందు, ఆ తర్వాత రోగుల అభిప్రాయాలను కూడా యాడ్ చేశారు.

నేత్ర వైద్యుడు జెఫ్ లెవెన్సన్ గత 20 సంవత్సరాలుగా ఎంతోమంది పేదలకు కంటిశుక్లం శస్త్రచికిత్సలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఇందుకోసం “గిఫ్ట్ ఆఫ్ సైట్” ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నారు. అందుకే లెవెన్సన్ ఆధ్వర్యంలో ఈ ఉచిత సర్జరీలు చేయించాను” అని మిస్టర్ బీస్ట్ చెప్పారు. దీనిపై డాక్టర్ లెవెన్సన్ మాట్లాడుతూ.. “MrBeast ఒక ఆశా కిరణంలా వెలిగాడు. దానికి ప్రభుత్వ , ప్రైవేట్ మద్దతు కూడా లభిస్తే ప్రపంచంలోని అంధత్వంలో సగానికి సగం అంతం చేయవచ్చు” అని చెప్పారు.

రెస్టారెంట్‌ని కూడా న‌డిపిస్తున్నాడు

అమెరికాకు చెందిన జిమ్మీ డొనాల్డ్స్ ప్ర‌పంచంలోనే ఎక్కువ మంది సబ్‌స్క్రైబ‌ర్స్ ఉన్న యూట్యూబ‌ర్‌గా నిలిచాడు. మిస్ట‌ర్ బీట్స్‌గా పాపుల‌ర్ అయిన జిమ్మీకి ప్రస్తుతం దాదాపు 112 మిలియ‌న్ స‌బ్‌స్క్రైబ‌ర్స్ (11 కోట్ల‌కు పైగా) ఉన్నారు. గ‌త కొన్నాళ్లుగా యూట్యూబ్‌లో రారాజుగా వెలుగొందుతున్న స్వీడ‌న్‌కి చెందిన చెందిన ఫెలిక్స్ అర్వింద్ ఉల్ఫ్ జెల్‌బ‌ర్గ్‌ని ఇత‌ను వెన‌క్కి నెట్టాడు. ప్యూ డై పైగా పేరుగాంచిన ఫెలిక్స్‌కు యూట్యూబ్‌లో 111.8 మిలియ‌న్ల మంది స‌బ్‌స్క్రైబ‌ర్స్ ఉన్నారు. బీస్ట్‌ యూట్యూబ్ ఛానెల్‌ని స‌బ్‌స్క్రైబ్ చేసుకున్న‌వాళ్ల సంఖ్య ఈమ‌ధ్యే 111.9 మిలియ‌న్లకు చేరింది. ఈ ఏడాది జూలైలో వంద మిలియ‌న్ల స‌బ్‌స్క్రైబ‌ర్స్‌ని సాధించిన రెండో యూట్యూబ‌ర్‌గా జిమ్మీ గుర్తింపు సాధించాడు.

Also Read: Union Budget 2023: ధరలు తగ్గేవి.. పెరిగేవి ఇవే..!

స్క్విడ్ గేమ్స్ సిరీస్ వీడియోల‌తోనెట్‌ ఫ్లిక్స్‌లో విడుద‌లై హిట్ టాక్ తెచ్చుకున్న‌ స్క్విడ్ గేమ్స్ సిరీస్‌ని రిక్రియేట్ చేయ‌డంతో జిమ్మీ పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. దాంతో, అతడి యూట్యూబ్ ఛానెల్‌ని చాలామంది స‌బ్‌స్క్రైబ‌ర్స్ చేసుకున్నారు. అంతేకాదు 2021లో అత్య‌ధిక ఆదాయం సంపాదించిన యూట్యూబ‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇత‌ను యూట్యూబ్‌లో వీడియోలు చేయ‌డమే కాకుండా అమెరికాలో మిస్ట‌ర్ బీస్ట్ బ‌ర్గ‌ర్ అనే రెస్టారెంట్‌ని కూడా న‌డిపిస్తున్నాడు. అమెరికాలో ఎక్కువ మంది స‌బ్‌స్క్రైబ‌ర్స్ ఉన్న యూటూబ్ ఛానెళ్ల‌లో మ‌న‌దేశానికి చెందిన టీ సిరీస్ యూట్యూబ్ ఛానెల్ ప్ర‌థ‌మ స్థానంలో ఉంది. టీ సిరీస్‌ని 229 మిలియ‌న్ల మంది( 20 కోట్ల‌కు పైగా) స‌బ్‌స్క్రైబ్ చేసుకున్నారు.