Site icon HashtagU Telugu

Yazidi Babies Meat: యజీదీ పిల్లల మాంసం వండిపెట్టారు.. యువతి సంచలన ఇంటర్వ్యూ

Yazidi Babies Meat Isis Idf Gaza

Yazidi Babies Meat: ఆమె పేరు ఫౌజియా అమీన్ సిడో.. ఆమె యజీదీ మతస్తురాలు. పదేళ్ల క్రితం ఆమెను  ఐసిస్‌ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. గత పది సంవత్సరాలుగా  లెబనాన్‌లోని ఐసిస్ ఉగ్రవాదుల చెరలో బందీగా ఫౌజియా జీవితాన్ని వెళ్లదీసింది. ఎట్టకేలకు ఆమెను ఐసిస్ చెర నుంచి ఇజ్రాయెలీ  సైన్యం విడిపించింది.  ఫౌజియా తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఐసిస్ ఉగ్రవాదుల క్రూరత్వానికి సంబంధించిన కొన్ని సంచలన విషయాలను వెల్లడించింది.

Also Read :Elon Musk: రోజూ ఒక ఓటరుకు రూ.8 కోట్లు.. ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్

ఫౌజియా అమీన్ సిడో ఏం చెప్పిందంటే.. 

‘‘నా పేరు ఫౌజియా అమీన్ సిడో. నేను ఇరాక్‌లోని సింజార్ ప్రాంతంలో యజీదీ మతానికి చెందిన కుటుంబంలో జన్మించాను. 2014లో ఐసిస్ ఉగ్రవాదులు ఇరాక్‌లో చెలరేగిపోయారు. మా యజీదీ మతానికి(Yazidi Babies Meat) చెందినవారిపై దాడులకు తెగబడ్డారు. ఎంతోమంది యజీదీ పిల్లలు, మహిళలను కిడ్నాప్ చేశారు. అలా నేను కూడా కిడ్నాప్‌కు గురయ్యాను. అప్పట్లో నా వయసు పదేళ్లే. కిడ్నాప్ చేసిన వాళ్లను ఐసిస్ ఉగ్రవాదులు ధర కట్టి మార్కెట్లో అమ్మేశారు. నన్ను కూడా అలానే అమ్మారు. తొలుత నన్ను ఒక సిరియా వ్యక్తి కొన్నాడు. కొంతకాలం తర్వాత అతడు ఒక సౌదీ అరేబియా షేక్‌కు నన్ను అమ్మాడు. ఆ సౌదీ అరేబియా షేక్ కొంత కాలం తర్వాత నన్ను ఒక సిరియా వ్యక్తికి అమ్మాడు. చివరగా సిరియాలో ఐసిస్‌లో పనిచేస్తున్న ఒక గాజా (పాలస్తీనా) వ్యక్తి నన్ను పెళ్లి చేసుకున్నాడు. అతడి వల్ల నాకు ఇద్దరు పిల్లలు కలిగారు’’ అని తన జీవితంలోని కష్టాలను కళ్లకు కట్టేలా ఫౌజియా అమీన్ సిడో వివరించింది. ‘‘నేను గత కొన్నేళ్లుగా పాలస్తీనాలోని గాజాలో పెళ్లి చేసుకున్న వ్యక్తితోనే ఉన్నాను. లక్కీగా గాజాపై ఇజ్రాయెల్ సైనిక చర్య చేయడం నాకు కలిసొచ్చింది. ఇజ్రాయెలీ దళాలు నన్ను గాజా నుంచి విడిపించి బయటికి తీసుకొచ్చాయి. ఇరాక్‌లో మా ఇంటికి చేరుకునేందుకు అన్ని రకాల సాయం చేశాయి’’ అని ఫౌజియా వివరించారు. ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలను గాజాలో ఉన్న భర్త కుటుంబమే చూసుకుంటోందని తెలిపింది.

Also Read :Group 1 : గ్రూప్ -1 నియామకాలపై వివాదం.. ఏమిటీ జీఓ 55.. జీఓ 29 ?

‘‘ఐసిస్ ఉగ్రవాదులు మమ్మల్ని బంధించాక.. మొదటి మూడు రోజులు పస్తులు ఉంచారు. చివరకు నాలుగో రోజు అన్నం, మాంసం తీసుకొచ్చారు. అది తింటుండగా చాలా  కంపు కొట్టింది. తిన్న వెంటనే కొందరికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఇదంతా జరిగాక.. మీరు తిన్న మాంసం యజిదీ శిశువులది అని చెప్పారు. యజీదీ చిన్నారులను చంపి, వంటవండిన ఫొటోలను మాకు చూపించారు. మీ పిల్లలను మీరే తిన్నారని తెలిపారు. ఇది చూసి.. కనిపించకుండా పోయిన తన శిశువును గుర్తు చేసుకొని ఒక యజీదీ మహిళ క్షణాల్లోనే చనిపోయింది’’ అని ఆనాటి పరిస్థితిని ఫౌజియా గుర్తు చేసుకుంది.