World Richest Women: ప్రపంచంలోనే అత్యంత సంపన్నురాలు ఎవరో మీకు తెలుసా.. ఆస్తి విలువ తెలిస్తే షాకవ్వాల్సిందే?

ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సంపన్నులు కోటీశ్వరులు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే కొందరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత ధనవంతులలో టాప్ 10

Published By: HashtagU Telugu Desk
World Richest Women

World Richest Women

ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సంపన్నులు కోటీశ్వరులు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే కొందరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత ధనవంతులలో టాప్ 10 లో నిలుస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు అనేక కారణాల వల్ల లాస్ అవ్వడం వల్ల ఆ స్థానాలు తారుమారు అవుతూ ఉంటాయి. అయితే ఈ సంపన్నులు చాలా లగ్జరీ లైఫ్ ను ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలాన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, భారతదేశం అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ మొదలగు పేర్లు మనకు వినిపిస్తాయి.

కానీ వారిని మించి అంతకన్నా ఎక్కువగా ఒక మహిళ ఉందట. ఇంతకీ ఆ మహిళ ఎవరు? ఏంటి అన్న వివరాల్లోకి వెళితే… ఈ ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలు ఒక మహిళ అనే విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు. ప్రపంచ కుబేరుల స్థానంలో అగ్రస్థానంలో ఉన్న ఈ సుందరి ఎవరంటే. భారతదేశపు అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ నికర విలువ దాదాపు $91 బిలియన్లు అయితే ఈ మహరాణి సంపద బిలియన్లలో కాదు ట్రిలియన్లలో ఉంది. ఇది దాదాపు 16 ట్రిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. చైనాకు చెందిన ఎంప్రెస్ వు భూమిపై నివసిస్తున్న అత్యంత సంపన్న మహిళ.

ఆమె నికర విలువ USD 16 ట్రిలియన్లుగా అంచనా. ఇది ఎలాన్ మస్క్, ముఖేష్ అంబానీ, జెఫ్ బెజోస్ తదితరుల నికర విలువ కంటే ఎక్కువ. ఎంప్రెస్ టాంగ్ రాజవంశానికి చెందిన మహిళ. ఆమె చరిత్రలో అత్యంత ధనిక మహిళా రాణి. చైనాకు చెందిన ఎంప్రెస్ వు ఇప్పటివరకు జీవించిన అత్యంత అందమైన మహిళల్లో ఒకరు. చైనీస్ చరిత్రలో ఆమె మొదటి, ఏకైక మహిళా చక్రవర్తి. ఆమె పదవి కోసం తన పిల్లలను కూడా చంపిన చరిత్ర కూడా ఉంది. టాంగ్ రాజవంశానికి చెందిన ఎంప్రెస్ వు చరిత్రలో అత్యంత ధనిక మహిళా చక్రవర్తిగా పేరు గాంచింది. ఈమె చాలా క్రూరమైన మహిళ అధికారంలో ఉండేందుకు సామ్రాజ్ఞి వు తన పిల్లలను కూడా చంపేశారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఎంప్రెస్ వు ఉన్నత విద్యావంతురాలు, ఆమె చమత్కారమైన జీవిత కథపై అనేక సీరియల్స్ కూడా వచ్చాయి. ఫ్యాన్ బింగ్‌బింగ్ నటించిన ఎంప్రెస్ ఆఫ్ చైనా అటువంటి టీవీ సిరీస్ దాదాపు 15 ఏళ్లు పాలించింది. కాగా ఆమె హయాంలో, టీ, సిల్క్ వ్యాపారంతో చైనా ఆర్థికవ్యవస్థ గణనీయమైన వృద్ధిని నమోదు చేసిందని చైనా ప్రాజెక్ట్ నివేదించింది. అలా ఆమె ఆదాయం ఇప్పటికి తగ్గలేదు.

  Last Updated: 04 Aug 2023, 03:36 PM IST