Powerful Nuclear Missile: పవర్ ఫుల్ అణు క్షిపణి ‘మినిట్‌ మ్యాన్‌-3’.. పరీక్షించిన అమెరికా.. ఎందుకు ?

మినిట్‌మ్యాన్‌-3 మిస్సైల్‌(Powerful Nuclear Missile)లో అణుబాంబులతో కూడిన న్యూక్లియర్‌ పేలోడ్‌ను అమర్చవచ్చు.

Published By: HashtagU Telugu Desk
Powerful Nuclear Missile Minuteman Iii Us Donald Trump

Powerful Nuclear Missile: మినిట్‌ మ్యాన్‌-3..  ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ఖండాంతర అణు క్షిపణి. దీన్ని ఈరోజు ఉదయం అమెరికా టెస్ట్ చేసింది. కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న వాన్డెన్‌బెర్గ్‌ స్పేస్‌ బేస్‌లో ఈ మిస్సైల్ టెస్ట్ జరిగింది. భూగర్భ సొరంగం నుంచి ప్రయోగించగానే ఈ మిస్సైల్ గంటకు 24,140 కిలోమీటర్ల వేగంతో 6,760 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఈ మిస్సైల్ చివరకు మార్షల్‌ ఐల్యాండ్స్‌లోని అమెరికా ఆర్మీ స్పేస్‌ అండ్‌ మిసైల్‌ డిఫెన్స్‌ కమాండ్‌కు చెందిన బాలిస్టిక్‌ డిఫెన్స్‌ టెస్ట్‌ ప్రదేశానికి చేరుకుంది. ఈ మిస్సైల్ టెస్టు వివరాలను అమెరికా గ్లోబల్‌ స్ట్రైక్‌ కమాండ్‌ జనరల్‌ థామస్‌ బుస్సెరీ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలకు ఈ పరీక్షకు ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. అమెరికాకు చెందిన ఆర్మీ స్పేస్‌ అండ్‌ మిసైల్‌ డిఫెన్స్‌ కమాండ్‌ అనేది ఆస్ట్రేలియాకు అత్యంత సమీపంలోని మార్షల్ ఐలాండ్స్‌లో ఉంది.

Also Read :Street Vendors : వీధి వ్యాపారులకు క్రెడిట్‌ కార్డులు.. రూ.80వేల దాకా క్రెడిట్ లిమిట్ ?

మినిట్‌మ్యాన్‌-3 పరీక్ష.. ఇప్పుడే ఎందుకు ?  

  • మినిట్‌మ్యాన్‌-3 మిస్సైల్‌(Powerful Nuclear Missile)లో అణుబాంబులతో కూడిన న్యూక్లియర్‌ పేలోడ్‌ను అమర్చవచ్చు.
  • ఈ మిస్సైల్ కొత్తదేమీ కాదు. దీన్ని 1970వ దశకంలోనే అమెరికా తయారు చేసింది.  అయితే ఇప్పుడు దీన్ని అదనపు  శక్తి సామర్థ్యాలు, అదనపు రేంజుతో అప్‌గ్రేడ్ చేసింది.
  •  భవిష్యత్తులో అమెరికా గగనతలంలోకి ఏ క్షిపణి కూడా ప్రవేశించకుండా చేసేందుకు ‘గోల్డెన్‌ డోమ్‌’ను నిర్మించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు.
  • ‘గోల్డెన్‌ డోమ్‌’‌పై ప్రకటన వెలువడిన కొన్ని రోజులకే మినిట్‌మ్యాన్‌-3ను పరీక్షించడం గమనార్హం.
  • అణుబాంబుల తయారీలో ప్రస్తుతం ఇరాన్ బిజీగా ఉంది. తమను ఎవరు అడ్డుకున్నా తీవ్రంగా ప్రతిస్పందిస్తామని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది.
  • రాబోయే రోజుల్లో ఇజ్రాయెల్, అమెరికాలు కలిసి ఇరాన్‌పై దాడి చేసే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే.. అమెరికా లక్ష్యంగా దీర్ఘశ్రేణి మిస్సైళ్లను ఇరాన్ వదిలే ముప్పు ఉంది.
  • ఈ అంశాన్ని అమెరికా ముందే పసిగట్టింది. ముందు జాగ్రత్త చర్యలు ఇప్పటి నుంచే మొదలుపెట్టింది.

Also Read :Pawan Kalyan: సినిమా థియేటర్‌లో లైవ్.. ప్రజలతో పవన్‌ వర్చువల్ ముఖాముఖి

  Last Updated: 22 May 2025, 12:12 PM IST