Shocking News: గర్భం దాల్చినట్టు తెలుసుకున్న 48 గంటలకే కొడుకును కన్న మహిళ..!

ఓ బిడ్డను కనాలంటే తల్లి తన గర్భంలో 9 నెలలు మోయాలి. 9 నెలల తర్వాత అంతకంటే ముందు బిడ్డను కంటే ఆ బిడ్డకు ప్రమాదం ఉంటుంది. కానీ ఆమెరికాకు చెందిన ఓ మహిళ మాత్రం గర్భం దాల్చినట్టు తెలుసుకున్న 48 గంటలకే బిడ్డకు జన్మనిచ్చింది.

  • Written By:
  • Publish Date - October 18, 2022 / 08:28 PM IST

ఓ బిడ్డను కనాలంటే తల్లి తన గర్భంలో 9 నెలలు మోయాలి. 9 నెలల తర్వాత అంతకంటే ముందు బిడ్డను కంటే ఆ బిడ్డకు ప్రమాదం ఉంటుంది. కానీ ఆమెరికాకు చెందిన ఓ మహిళ మాత్రం గర్భం దాల్చినట్టు తెలుసుకున్న 48 గంటలకే బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఈ షాకింగ్‌ ఘటనలో తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.

అమెరికాకు చెందిన 23 ఏండ్ల పేటన్‌ స్టోవర్‌ ఓ విద్యాసంస్థలో ఆమె టీచర్‌గా వర్క్ చేస్తుంది. ఇటీవల ఆమెకు తల తిరిగినట్లు.. వాంతు వచ్చినట్లుగా అనిపించడంతో అక్కడ ఉన్న వైద్యులను సంప్రదించింది. ఆమెను పరీక్షించిన వైద్యులు ప్రెగ్నెన్సీ వచ్చిందని తెలిపారు. కానీ ఆమె నమ్మలేదు. మరోసారి పరీక్షలు చేపించుకుంది. రెండోసారి పరీక్షల్లో కూడా గర్భిణి అని తేలింది. అయితే గర్భం వచ్చి ఆరు నెలలు దాటిందని వైద్యులు చెప్పడంతో దంపతులిద్దరూ షాక్ కు గురిఅయ్యారు. అయితే ప్రెగ్నెన్సీతోపాటు ఆమెకు అరుదుగా వచ్చే ప్రీక్లామ్‌ప్సియా అనే రుగ్మత ఉందని వైద్యులు పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు స్టోవర్‌ ఆస్పత్రిలో చేరగా.. 48 గంటల్లో సర్జరీ చేసిన డాక్టర్స్ తల్లీబిడ్డ ఇద్దరినీ కాపాడారు. స్టోవర్‌ కు ఒక కిలో 800 గ్రాముల బరువుతో మగబిడ్డ జన్మించాడు.