king charles kohinoor : కోహినూర్‌ ను కింగ్ చార్లెస్ ఇండియాకు ఇచ్చేస్తారా?

బ్రిటన్ కింగ్ చార్లెస్ III పట్టాభిషేక కార్యక్రమం మే 6న జరిగిన నేపథ్యంలో ఒక అంశం మరోసారి తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలోనూ దానిపై డిబేట్ మొదలైంది. అదే.. కోహినూర్ వజ్రం (king charles kohinoor) ఇష్యూ !

  • Written By:
  • Updated On - May 7, 2023 / 12:36 PM IST

బ్రిటన్ కింగ్ చార్లెస్ III పట్టాభిషేక కార్యక్రమం మే 6న జరిగిన నేపథ్యంలో ఒక అంశం మరోసారి తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలోనూ దానిపై డిబేట్ మొదలైంది. అదే.. కోహినూర్ వజ్రం (king charles kohinoor) ఇష్యూ ! “కనీసం ఇప్పుడైనా మనం కోహినూర్ వజ్రాన్ని తిరిగి పొందగలమా? ” అనే టాపిక్ పై నెటిజన్స్ మధ్య హాట్ డిస్కషన్ జరిగింది. బ్రిటీష్ వారు స్వాధీనం చేసుకున్న కోహినూర్ వజ్రాన్ని తిరిగి ఇండియాకు ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు కింగ్ చార్లెస్ III పట్టాభిషేక వేడుకను పరిశీలిస్తే.. ఆయన భార్య క్వీన్ కన్సార్ట్ కెమిల్లా వారసత్వంగా క్వీన్ ఎలిజబెత్ నుంచి వచ్చిన కిరీటాన్ని ధరించారు. కానీ అందులో కోహినూర్ వజ్రం (king charles kohinoor) లేదు. ఇండియా మూలాలు కలిగిన కోహినూర్ వజ్రం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వజ్రాలలో ఒకటి. అయితే దానికి ఉన్న వివాదాస్పద చరిత్ర నేపథ్యంలో.. కిరీటంలో కోహినూర్ వజ్రాన్ని క్వీన్ కెమిల్లా అలంకరించుకోలేదని అంటున్నారు. ప్రస్తుతం లండన్ టవర్ యొక్క జ్యువెల్ హౌస్‌లో కోహినూర్ వజ్రాన్ని ప్రదర్శనకు ఉంచారు. ఈ వజ్రాన్ని భారతీయ చక్రవర్తి తమకు బహుమతిగా ఇచ్చారని బ్రిటీష్ వారు చెబుతుండగా.. అది 18వ శతాబ్దంలో బలవంతంగా ఇండియా నుంచి తీసుకోబడిందని చాలామంది ఇండియన్స్ నమ్ముతున్నారు. కోహినూర్ ను తిరిగి ఇవ్వాలని 1947లో ఒకసారి, 1953లో మరోసారి భారత్ కోరినా బ్రిటన్ స్పందించలేదు. 2000 సంవత్సరంలో పలువురు ఎంపీలు వజ్రం కోసం క్లెయిమ్ చేశారు. అయితే బ్రిటన్ అధికారులు దాన్ని తిరిగిచ్చేది లేదన్నారు. వివిధ దేశాల నుంచి తెచ్చిన విలువైన వస్తువులను తిరిగి ఆ దేశాలకే ఇచ్చేస్తే.. తమ మ్యూజియంలో ఒక్క వస్తువు కూడా మిగలదని అప్పటి బ్రిటన్ ప్రధాని డేవిడ్ కెమెరాన్ అహంకారపూరిత కామెంట్ చేశారు.

ALSO READ : Kohinoor Diamond : బ్రిట‌న్ రాజ‌కుమారికి కోహినూర్ కిరీటం

మన కొల్లూరుకు.. కోహినూర్ కు లింక్ ఉందా ?

తెలుగు గడ్డపై కృష్ణా నదీ తీరంలో నల్లమల కొండల అంచుల్లోని కొల్లూరు గనుల్లో 900 కేరట్ల కోహినూర్ వజ్రం దొరికిందని చరిత్రకారులు అంటున్నారు. కృష్ణానదిని ఆనుకుని ఉండే కొల్లూరు గ్రామం పులించింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతం కావడంతో ఇప్పుడు ఖాళీ అయిపోయింది. కోల్లూరుకు వెళ్లాలంటే.. సత్తెనపల్లి నుంచి ఇరుకైన, కుదుపుల దారిలో ప్రయాణించాలి. ఈ ఊరు దాటిన తరువాత కృష్ణా నది ఒడ్డున పంతులుగారి చెరువు అనే ప్రాంతముంది. సరిగ్గా ఇదే కోహినూర్ వజ్రం దొరికిన ప్రాంతం అని అంటారు. ఇక్కడ మట్టికంకర రాళ్ల గుంతలు 2 – 14 అడుగుల వరకూ ఉంటాయి. వజ్రాలు ఉండే పొర దాదాపు అడుగుమందం ఉంటుంది.ఈ ప్రాంతంలో ఇప్పటికీ కుతుబ్‌ షాహీలకాలంలో నిర్మించిన వాచ్ టవర్ ఉంది. అప్పట్లో కొల్లూరు గనుల్లో వేలాది మంది పనిచేసే వారట.

ALSO READ : Kohinoor: కోహినూర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న బ్రిటన్‌..!

దిలీప్ సింగ్ ను చెరపట్టి.. కోహినూర్ లాక్కొని..

1813 సంవత్సరం నాటికి సిక్కు రాజు మహారాజా రంజిత్ సింగ్ తన కిరీటంలో కోహినూర్ వజ్రం ధరించేవారట. 1839లో రంజిత్ సింగ్ చనిపోయిన తర్వాత.. ఆయన పదేళ్ల కుమారుడు దిలీప్ సింగ్ పాలకుడయ్యాడు. అతడిని 1849లో బ్రిటన్ ఆర్మీ ఓడించి.. కోహినూర్ వజ్రాన్ని లాక్కొని ఇంగ్లాండ్ రాణికి గిఫ్ట్ గా పంపారు. అప్పటి నుంచి కోహినూర్ డైమండ్ బ్రిటన్ లోనే ఉంటోంది. మహారాజా రంజిత్ సింగ్ భార్య జిందాన్‌ కౌర్‌ బ్రిటిష్‌ సార్వభౌమత్వాన్ని అంగీకరించలేదు. దీంతో ఆమెను నిర్బంధంలో ఉంచారు. రంజిత్ సింగ్ పదేళ్ల కొడుకు దిలీప్ సింగ్ ను క్రైస్తవంలోకి మార్చారు. ఆయనను ఇంగ్లండ్‌ కు చెందిన లోగిన్స్‌ దంపతులు దత్తత తీసుకున్నారు. అక్కడ విక్టోరియా మహారాణికి దిలీప్ సింగ్ అత్యంత ఇష్టుడైపోయాడు. 19వ శతాబ్దంలో ఫ్రాంజ్‌ జేవియర్‌ వింటర్‌హాల్టర్‌ చేత దిలీప్ సింగ్ నిలువెత్తు ఫోటోను విక్టోరియా రాణి గీయించింది.