Makeup Lessons: పురుష పోలీసులకు మేకప్‌లో ట్రైనింగ్ ఇస్తున్నారు. పోలీసు పోస్టులకు ఎంపికైన అభ్యర్థులంతా సీరియస్‌గా మేకప్ పాఠాలను నేర్చుకుంటున్నారు. ఇంతకీ ఎందుకు ? మేకప్ పాఠాలను నేర్చుకొని పోలీసులు ఏం చేస్తారు ? అని అనుకుంటున్నారా !! సమాధానం తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.
Also Read :Lizard Venom VS Diabetes : షుగర్ ఔషధాలకు విషపూరిత బల్లులతో లింక్.. ఏమిటి ?
వామ్మో.. అవన్నీ నేర్పిస్తున్నారు
జపాన్ అంటేనే విప్లవాత్మక సంస్కరణలకు పెట్టింది పేరు. అక్కడి ప్రజలు క్రమశిక్షణకు మారుపేరు. కష్టపడి పనిచేసే విషయంలో వారికి వారే సాటి. అందుకే అణుబాంబులు పడిన తర్వాత కూడా జపాన్ మళ్లీ పైపైకి ఎగిసింది. జపాన్‌లోని పోలీసు శాఖలో విప్లవాత్మక సంస్కరణలను అమలు చేస్తున్నారు. పోలీసు శాఖలోని వివిధ పోస్టులకు ఎంపికయ్యే వారికి ఆల్‌రౌండ్ శిక్షణ అందిస్తున్నారు. ప్రతీ అంశంపై వారికి కనీస అవగాహన కల్పించేందుకు జపాన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈక్రమంలోనే జపాన్‌లోని పుకుషిమాలో ఉన్న పోలీసు అకాడమీ తమ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్న పోలీసు అధికారులకు మేకప్ చేయడంలోనూ శిక్షణ ఇస్తోంది. మేకప్ ఎలా చేసుకోవాలి ? అందంగా ఎలా కనిపించాలి ? ఐబ్రోస్ చేసుకోవడం ఎలా ? పెన్సిల్ వాడడం ఎలా ? స్కిన్ మాయిశ్చరైజింగ్ చేసుకోవడం ఎలా ? ప్రైమర్లు పూసుకోవడం ఎలా ? ఫేస్ మాస్కులు, ఫేస్ ప్యాకులు వేసుకోవడం ఎలా ? హెయిర్ స్టైలింగ్ చేసుకోవడం ఎలా ? అనే అన్ని అంశాలపై ట్రైనీ పోలీసు అధికారులకు నేర్పిస్తోంది. పుకుషిమాలోని పోలీసు అకాడమీలో 2025 జనవరి నెలలో మొత్తం 60 మంది పోలీసు అధికారులకు మేకప్ కోర్సును ప్రారంభించారు. వారికి ట్రైనింగ్ ఇచ్చేందుకు ప్రముఖ జపనీస్ కాస్మటిక్స్ బ్రాండ్ షిసోడో నుంచి ప్రొఫెషనల్ మేకప్ కన్సల్టెంట్లను పోలీసు అకాడమీకి పిలిపించారు.
Also Read :Shashi Tharoor: శశి థరూర్ ఏం చేయబోతున్నారు ? ఆయన ఫ్యూచర్ ప్లాన్ ఏమిటి ?
ఎందుకీ ట్రైనింగ్ ?
పోలీసులు శుభ్రంగా, అందంగా ఉంటే చూసేందుకు బాగుంటుంది. అపరిశుభ్రంగా కనిపిస్తే వారితో మాట్లాడేందుకు కొందరు ఇష్టపడరు. మేకప్‌పై పురుష పోలీసులు పెద్దగా ఆసక్తి చూపరు. అందుకే పురుష పోలీసులకు(Makeup Lessons) మేకప్‌లో ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇతరుల ఎదుట పోలీసులు అందంగా తమను తాము ప్రజెంట్ చేసుకునేందుకు ఈ ట్రైనింగ్ దోహదపడుతుందని పుకుషిమా పోలీసు అకాడమీ నిర్వాహకులు చెబుతున్నారు.