Site icon HashtagU Telugu

Tulsi Gabbard : అమెరికా ఇంటెలీజెన్స్ చీఫ్‌గా తులసి.. ఆమె ఎవరు ?

Tulsi Gabbard Us National Intelligence Chief Trump

Tulsi Gabbard : అమెరికా గడ్డపై భారత బిడ్డకు కీలక పదవి దక్కబోతోంది. భారత సంతతి నాయకురాలు తులసీ గబార్డ్‌ను అమెరికా జాతీయ ఇంటెలీజెన్స్ విభాగం డైరెక్టర్‌గా నియమిస్తానని ట్రంప్ ప్రకటించారు. ‘‘రెండు దశాబ్దాల పాటు లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో అమెరికన్ల స్వాతంత్య్రం కోసం తులసి పనిచేశారు. కొత్త పదవిలో ఆమె అమెరికా నిఘా యంత్రాంగాన్ని తీర్చిదిద్దుతారని నేను నమ్ముతున్నాను. రాజ్యాంగ హక్కులను పరిరక్షిస్తూ, బలమైన వ్యక్తిత్వంతో ముందుకు సాగుతారని విశ్వసిస్తున్నాను’’ అని ట్రంప్ ఈసందర్భంగా వ్యాఖ్యానించారు. అమెరికా జాతీయ ఇంటెలీజెన్స్ విభాగం.. నిఘా వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటుంది. అమెరికాలో నిఘా సంబంధిత కార్యకలాపాలను ఈ విభాగం కంట్రోల్ అండ్ ఆపరేట్ చేస్తుంది. ఇంతకీ తులసీ గబార్డ్ ఎవరు ఈ కథనంలో తెలుసుకుందాం..

Also Read :Phone Tapping Case : టేబుల్‌పై గన్ పెట్టి  నన్ను బెదిరించారు : ఎమ్మెల్యే వేముల వీరేశం

తులసీ గబార్డ్ నేపథ్యం.. 

  • తులసీ గబార్డ్(Tulsi Gabbard) పశ్చిమాసియా, ఆఫ్రికాల్లోని యుద్ధక్షేత్రాల్లో మూడుసార్లు అమెరికా సైన్యం తరఫున పనిచేశారు.
  • అమెరికా చట్టసభ కాంగ్రెస్‌‌కు ఎన్నికైన తొలి హిందూ వర్గం నాయకురాలిగా తులసి గబార్డ్‌గా మంచి పేరుంది.
  • ఇప్పటివరకు నాలుగుసార్లు అమెరికా కాంగ్రెస్‌కు తులసి ఎన్నికయ్యారు.
  • డొనాల్డ్ ట్రంప్ ప్రాతినిధ్యం వహించే రాజకీయ పార్టీ పేరు ‘రిపబ్లికన్’. అయితే 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి రాజకీయ విరోధి అయిన డెమొకట్రిక్‌ పార్టీ తరఫున ఒక కాంగ్రెషనల్ స్థానం నుంచి అభ్యర్థిగా తులసి పోటీ చేశారు.
  • అయితే 2022లో డెమొక్రటిక్ పార్టీకి తులసి దూరమయ్యారు. స్వతంత్రంగా ఉంటూ వచ్చారు.
  • ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల టైంలో ఆమె రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. ఎన్నికలకు ముందే ట్రంప్‌నకు తన మద్దతును ప్రకటించారు.
  • ఇక అధ్యక్ష ఎన్నికలకు ముందు డొనాల్డ్ ట్రంప్​నకు మద్దతు పలికారు. ట్రంప్ తరఫున చాలా చోట్ల ముమ్మర ప్రచారం చేశారు.అందుకే ఇప్పుడు కీలకమైన అవకాశాన్ని ఆమెకు ట్రంప్ కల్పిస్తున్నారు.