Canada PM Race : కెనడా ప్రధానమంత్రి పదవి రేసులోకి మరో భారత సంతతి నేత వచ్చారు. ఆయన మరెవరో కాదు.. ఎంపీ చంద్ర ఆర్య. నేపియన్ ప్రాంతం నుంచి కెనడా పార్లమెంటుకు చంద్ర ఆర్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జస్టిన్ ట్రూడో రాజీనామాతో ఖాళీ అయిన కెనడా ప్రధానమంత్రి పదవికి జరుగుతున్న పోటీలో తాను కూడా ఉన్నానని ఆయన వెల్లడించారు. ఈమేరకు ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అందులో చంద్ర ఆర్య ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం..
Also Read :Game Changer Talk : గేమ్ ఛేంజర్ పబ్లిక్ టాక్
బలమైన నాయకత్వం అందిస్తా
‘‘మునుపెన్నడూ లేని విధంగా పలు నిర్మాణాత్మక సమస్యలను కెనడా ఎదుర్కొంటోంది. వాటిని పరిష్కరించాలంటే మనం కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకోక తప్పదు. దేశ భావితరాల కోసం సాహసోపేత నిర్ణయాలను తీసుకోవాలి. పెద్దపెద్ద నిర్ణయాలను తీసుకోవడంలో భయపడని బలమైన నాయకత్వం కెనడాకు(Canada PM Race) కావాలి. దేశ ప్రయోజనాల కోసం సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం అనేది ఐచ్ఛికం కాదు, తప్పనిసరి. అలాంటి నిర్ణయాలే కెనడా పునర్నిర్మాణానికి దోహదం చేస్తాయి. భావితరాల భవితను సురక్షితంగా మారుస్తాయి. కెనడా ప్రధానిగా అవకాశమిస్తే నేను ఆ దిశగా నిర్ణయాలు తీసుకునే చొరవను చూపిస్తా’’ అని ఎంపీ చంద్ర ఆర్య ప్రకటించారు.
Also Read :World Hindi Day : ప్రపంచ హిందీ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు..? ప్రత్యేకత ఏమిటి?
‘‘నన్ను అధికార లిబరల్ పార్టీ పార్లమెంటరీ నేతగా ఎన్నుకుంటే కెనడా ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తాను. కెనడా ఆర్థిక వ్యవస్థను మళ్లీ పట్టాలు ఎక్కిస్తా’’ అని చంద్ర ఆర్య తెలిపారు. కెనడా ఆర్థిక వికాసంలో అందరు కెనడియన్లను భాగస్తులుగా చేస్తానన్నారు. దేశంలో పేదలు, యువత వికాసం కోసం పక్కా ప్రణాళికతో పాలన సాగిస్తానని చెప్పారు. గత సోమవారం రోజు కెనడా ప్రధాని పదవికి జస్టిన్ ట్రూడో రాజీనామా చేశారు. దీంతో ఆ పదవిని భర్తీ చేయడంపై అధికార లిబరల్ పార్టీ ఫోకస్ పెట్టింది.
చంద్ర ఆర్య నేపథ్యం
- ఎంపీ చంద్ర ఆర్య కర్ణాటకలో జన్మించారు.
- కర్ణాటక రాష్ట్రంలోని తూముకూరు జిల్లా సిరా తాలూకా ద్వర్లు గ్రామంలో ఆయన జన్మించారు.
- ఆయన ధార్వాడ్‌లో ఉన్న కౌశాలి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో ఎంబీఏ చేశారు.
- 2006లో ఆయన కర్ణాటక నుంచి కెనడాకు వలస వెళ్లారు.
- తొలినాళ్లలో ఆయన ఇండో-కెనడా ఒట్టావా బిజినెస్ ఛాంబర్ ఛైర్మన్‌గా వ్యవహరించారు.
- తదుపరిగా కెనడా రాజకీయాల్లోకి ప్రవేశించారు.