Site icon HashtagU Telugu

SBI Report: ట్రంప్ టారిఫ్ పెంచ‌డానికి కార‌ణం ఏమిటి? ఎస్‌బీఐ నివేదిక‌లో షాకింగ్ విష‌యాలు!

SBI Report

SBI Report

SBI Report: ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ (SBI Report) ఇటీవల విడుదల చేసిన ఒక నివేదిక ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కొనసాగుతున్న టారిఫ్ వార్ అనగా వాణిజ్య యుద్ధాల మూలాలను వెల్లడించింది. ఇది కేవలం రెండు దేశాల మధ్య వివాదం మాత్రమే కాదు. బదులుగా గ్లోబల్ ట్రేడ్ అసమతుల్యత పెద్ద, లోతుగా అనుసంధానించబడిన సమస్య. ఇది రాబోయే సంవత్సరాల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను విస్తృతంగా ప్రభావితం చేయవచ్చు.

నివేదిక ప్రకారం.. అమెరికా- చైనా మధ్య వాణిజ్య యుద్ధానికి ప్రధాన కారణం ఈ రెండు దేశాల ఆర్థిక నిర్మాణంలో ఉన్న భారీ వ్యత్యాసం. చైనా తన దేశంలో ఉత్పత్తి, పెట్టుబడులపై దృష్టి సారిస్తుంది. అయితే అమెరికా వినియోగం అనగా ఖర్చు చేయడంలో ముందుంది. ఈ తేడా ప్రపంచ వాణిజ్య ప్రవాహంలో పెద్ద అసమతుల్యతను సృష్టిస్తుంది.

చైనా తన GDPలో సుమారు 42% పెట్టుబడులలో వినియోగిస్తుంది. కేవలం 40% ఖర్చు చేస్తుంది. దీనికి విరుద్ధంగా అమెరికా కేవలం 22% పెట్టుబడి పెడుతుంది కానీ 68% ఖర్చు చేస్తుంది. దీని ప్రభావం ఏమిటంటే చైనాకు వాణిజ్యంలో భారీ లాభం వస్తోంది. అయితే అమెరికాకు భారీ నష్టం ఏర్పడుతోంది.

Also Read: Shubman Gill: విరాట్ కోహ్లీ మ‌రో రికార్డు ఔట్‌.. గిల్ ఖాతాలో ఇంకెన్నో!

భారతదేశం స్థితి ఏమిటి?

భారతదేశం స్థితి ఈ రెండింటి మధ్యలో ఉంది. భారతదేశం GDPలో 33% పెట్టుబడి పెడుతుంది. 62% వినియోగిస్తుంది. భారతదేశం వాణిజ్య లోటు సుమారు 275 బిలియన్ డాలర్లు. అయితే అమెరికా లోటు 1,202 బిలియన్ డాలర్లు. చైనా అధిక్యం 992 బిలియన్ డాలర్ల సమీపంలో ఉంది. SBI నివేదికలో అమెరికా పొదుపు రేటు కేవలం 18% మాత్రమే. అయితే చైనా 43%, భారతదేశం 33% అని కూడా తెలిపింది. అంటే అమెరికా ఎంత తక్కువ పొదుపు చేస్తుందో? అంత ఎక్కువ ఖర్చు చేస్తుంది. ఫలితంగా అమెరికాపై 27.6 ట్రిలియన్ డాలర్ల బాహ్య రుణం ఉంది. అయితే చైనాది కేవలం 2.4 ట్రిలియన్, భారతదేశం రుణం 0.7 ట్రిలియన్ డాలర్లు మాత్రమే.

ఈ అసమతుల్యతను ఎదుర్కోవడానికి అమెరికా టారిఫ్‌లు (దిగుమతి సుంకాలు) వంటి చర్యలను అవలంబిస్తోంది. టారిఫ్‌లు విధించడం ఉద్దేశం చైనా నుండి దిగుమతులను ఖరీదైనవిగా చేయడం, దేశీయ పరిశ్రమను ప్రోత్సహించడం. నివేదికలో ఇది కేవలం తాత్కాలిక వాణిజ్య వివాదం కాదు. బదులుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెద్ద, శాశ్వతమైన మార్పు అని పేర్కొన్నారు. అమెరికన్ పరిపాలన, ముఖ్యంగా ట్రంప్ ప్రభుత్వం, చైనాపై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా అనేక చర్యలు తీసుకుంది.