What Is Autopen : ఏమిటీ ఆటోపెన్‌ ? బైడెన్ ఏం చేశారు ? నిప్పులు చెరిగిన ట్రంప్

డూప్లికేట్‌ సంతకాలను నిజమైన ఇంకుతో చేసే యంత్రాన్ని ఆటోపెన్(What Is Autopen) అంటారు.

Published By: HashtagU Telugu Desk
Autopen Signature Donald Trump Vs Biden Pardons

What Is Autopen : రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయినప్పటి నుంచి డొనాల్డ్‌ ట్రంప్‌ వీర దూకుడుపై ఉన్నారు. ఇప్పుడు ఆయన టార్గెట్‌లోకి మాజీ ప్రెసిడెంట్ జో బైడెన్ వచ్చారు. దేశ అధ్యక్షుడిగా ఉన్న టైంలో బైడెన్ పలువురికి క్షమాభిక్షలు ప్రసాదించారు. ఆ అంశాన్ని ఇప్పుడు ట్రంప్ లేవనెత్తారు. బైడెన్ హయాంలో ఇచ్చిన క్షమాభిక్షలకు సంబంధించిన పత్రాలపై ఆటోపెన్ సంతకాలు ఉన్నాయని ట్రంప్ ఆరోపించారు.

Also Read :George Soros Vs ED : ‘జార్జ్ సోరోస్‌’ నుంచి లబ్ధిపొందిన సంస్థలపై ఈడీ రైడ్స్

ఆటోపెన్‌ అంటే.. ?

  • ఆటోపెన్‌.. పేరులోనే విషయమంతా ఉంది. ఆటోమేటిక్‌గా సంతకాలు చేసే పెన్ ఇది.
  • డూప్లికేట్‌ సంతకాలను నిజమైన ఇంకుతో చేసే యంత్రాన్ని ఆటోపెన్(What Is Autopen) అంటారు.
  • ఉన్నత పదవుల్లో ఉండే వారు, సెలబ్రిటీలు, పారిశ్రామిక దిగ్గజాలు భారీ సంఖ్యలో ఆటోగ్రాఫ్‌లు చేయడానికి ఆటోపెన్‌లను వాడుతుంటారు.
  • ఒక ప్రత్యేక ప్రింటర్‌‌లోని హ్యాండ్ హ్యాంగర్‌లో పెన్ను తగిలించి ఉంటుంది. తొలుత ఈ ప్రింటర్‌లో మనం ఒక ప్రోగ్రామ్‌‌ను రాయాలి. ఏ సంతకం చేయాలి ? ఎంత సైజులో చేయాలి ? ఎన్ని సంతకాలు చేయాలి ? అనే వివరాలను మనం రాసే ప్రోగ్రామ్‌లో ప్రస్తావించాలి. దీనికి అనుగుణంగా  ఈ ఆటోపెన్ ఆటోమేటిక్‌గా సంతకాలు చేస్తుంది.
  • అమెరికాలోని వైట్ హౌస్‌కు ఆటో పెన్‌లను మేరీల్యాండ్‌కు చెందిన ‘ది ఆటోపెన్‌ కంపెనీ’ సప్లై చేస్తుంటుంది. గత 60 ఏళ్లుగా ఈ కంపెనీ ఆటో‌పెన్‌లను తయారు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలువురు దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలు ఆటోపెన్‌లను వాడుతున్నారు.
  • 19వ శతాబ్ధం తొలినాళ్లలో ఓ ప్రత్యేకమైన పాలీగ్రాఫ్‌ యంత్రాన్ని వాడేవారు. రెండు పెన్నులతో రాసేందుకు వీలుగా అది ఉండేది.   1803లో దీనిపై పేటెంట్‌ ఇచ్చారు.
  • మాజీ అమెరికా అధ్యక్షుడు థామస్‌ జెఫర్సన్‌ తన పదవీకాలం తర్వాత కూడా పాలీగ్రాఫ్‌‌ను వాడేవారు.
  • 2005లో అమెరికా న్యాయశాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. ఆటోపెన్‌‌తో సంతకాలు చేయడం అనేది చట్టబద్ధమే.
  • గతంలో చాలామంది అమెరికా అధ్యక్షులు ఆటో పెన్‌‌ను వాడారు.
  • మాజీ అమెరికా అధ్యక్షుడు  బరాక్‌ ఒబామా ది పేట్రియాట్‌ యాక్ట్‌కు సంబంధించి తీసుకున్న నిర్ణయంపై ఆటోపెన్‌‌తో సంతకం చేశారు. ఇది అప్పట్లో వివాదాస్పదంగా మారింది.

Also Read :Anirudh Reddy : కాంగ్రెస్ ఎమ్మెల్యేకు కేటీఆర్ మద్దతు..ఏంజరగబోతుంది..?

ఆటో పెన్‌పై రగడ ఎందుకు ? 

‘‘గతంలో అమెరికా ప్రెసిడెంట్ హోదాలో జో బైడెన్ ఇచ్చిన క్షమాభిక్షలు చెల్లవు. ఎందుకంటే క్షమాభిక్ష ఆదేశాల ప్రతులపై బైడెన్ ఆటోపెన్‌లతో సంతకాలు చేయించారు. అసలు ఆ క్షమాభిక్షలను ఎందుకు ప్రసాదించారనే విషయం కూడా బైడెన్‌కు తెలియదు. కారణం తెలియకుండా ఇచ్చిన క్షమాభిక్షలు చట్టపరంగా చెల్లవు. బైడెన్‌కు వయసు మీద పడి.. అప్పట్లో ఏం చేస్తున్నారో అర్థం కాలేదు. పక్కనున్న వారు ఏది చెబితే అది.. గుడ్డిగా చేస్తూ పోయారు.  క్షమాభిక్ష ఆదేశాల ప్రతుల్లో బైడెన్ ఆటోపెన్‌తో సంతకాలు పెట్టించారని మేం గుర్తించాం. దీనిపై కోర్టులే తుది నిర్ణయం తీసుకుంటాయి’’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.

  Last Updated: 18 Mar 2025, 04:11 PM IST