US President Powers : అమెరికా ప్రెసిడెంట్‌కు ఉండే పవర్స్ గురించి తెలుసా ?

అమెరికా ప్రభుత్వానికి(US President Powers) దిక్సూచి దేశాధ్యక్షుడే. దేశ పాలనా విధానాలన్నీ ఆయన కనుసన్నల్లోనే  రెడీ అవుతాయి.

Published By: HashtagU Telugu Desk
Us President Powers And Duties Us President Donald Trump

US President Powers : డొనాల్డ్ ట్రంప్.. అమెరికా నూతన అధ్యక్షుడిగా సోమవారం రోజు ప్రమాణం చేస్తారు. మరోసారి అగ్రరాజ్యాన్ని లీడ్ చేసే అరుదైన అవకాశాన్ని ఆయన అందుకుంటున్నారు. యూఎస్ ప్రెసిడెంట్‌గా ఆయనకు ఎలాంటి అధికారాలు లభిస్తాయి ? ట్రంప్ నిర్వర్తించబోయే విధులు ఎలా ఉంటాయి ? అనేది తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.

Also Read :US President Vs World Leaders : అమెరికాను మించిన రేంజులో ఈ దేశాధినేతలకు శాలరీలు

అమెరికా ప్రెసిడెంట్ కార్యనిర్వాహక అధికారాలు

  • అమెరికా ప్రభుత్వానికి(US President Powers) దిక్సూచి దేశాధ్యక్షుడే. దేశ పాలనా విధానాలన్నీ ఆయన కనుసన్నల్లోనే  రెడీ అవుతాయి.
  • అమెరికా జాతీయ ప్రయోజనాలకు ఉపయోగపడేలా ప్రభుత్వ విధానాలను ప్రెసిడెంట్ రెడీ చేస్తారు.
  • అన్ని ప్రభుత్వ విభాగాలు చట్టాలను అమలు చేసేలా పర్యవేక్షిస్తారు.
  • జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా అమెరికా విదేశాంగ విధానాల్లో ప్రెసిడెంట్ మార్పులు చేస్తారు.
  • ప్రభుత్వంలోకి మంత్రుల నియామకం, ప్రభుత్వ సంస్థలకు సారథుల నియామకం చేసేది ప్రెసిడెంటే.
  • దేశంలోని చట్టసభల(కాంగ్రెస్) ఆమోదం లేకుండా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌ను జారీ చేసే పవర్ ప్రెసిడెంట్‌కు ఉంది.

Also Read :Shunya Air Taxi : నగరాల్లో గగనవిహారం.. ‘శూన్య’ ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ ఇదిగో

అమెరికా ప్రెసిడెంట్ శాసన అధికారాలు

  • అమెరికాలో కొత్తగా ఏ చట్టాలు అమలులోకి రావాలి అనేది ప్రెసిడెంటే నిర్ణయిస్తారు. ఆయన ఆదేశం మేరకు అధికార పార్టీ ఆయా బిల్లులను చట్టసభల్లోకి ప్రవేశపెడుతుంది.
  • అత్యవసర అంశాలపై చర్చించేందుకు అమెరికా చట్టసభలను అత్యవసరంగా సమావేశపర్చే అధికారం దేశాధ్యక్షుడికి ఉంటుంది.
  • అమెరికా చట్టసభలు ఆమోదించిన బిల్లులను వీటో చేసే అధికారం దేశాధ్యక్షుడికి ఉంటుంది. అయితే అమెరికా కాంగ్రెస్ ఉభయ సభలు మూడింట రెండోవంతు మెజారిటీతో ఈ వీటో పవర్‌ను అడ్డుకోగలవు.
  • ఏటా ఒకసారి అమెరికా చట్టసభలు సంయుక్త సమావేశం నిర్వహిస్తాయి. దీని దేశాధ్యక్షుడే అధ్యక్షత వహిస్తాడు.

అమెరికా ప్రెసిడెంట్ సైనిక అధికారాలు

  • అమెరికాలో దేశాధ్యక్షుడే..  కమాండర్ ఇన్ చీఫ్‌.
  • సైన్యం మోహరింపు, సైనిక ఆపరేషన్ల నిర్వహణ వంటివన్నీ ప్రెసిడెంట్ పరిధిలోకే వస్తాయి.
  • యుద్ధ సంబంధ నిర్ణయాలను దేశం తరఫున ప్రెసిడెంట్ తీసుకుంటారు. అయితే వాటిని 48 గంటల్లోగా అమెరికా కాంగ్రెస్‌కు తెలియజేయాలి.
  • మరో దేశంపై యుద్దాన్ని ప్రకటించే అధికారం మాత్రం అమెరికా కాంగ్రెస్‌కే ఉంటుంది.
  Last Updated: 19 Jan 2025, 08:29 PM IST