Site icon HashtagU Telugu

Nuclear Warning: దాడి చేసినా.. నీళ్లు ఆపినా.. అణుబాంబులు వేస్తాం : పాక్

Pakistans Russia Ambassador Nuclear Warning Pakistan India Nuclear Weapons

Nuclear Warning: తినడానికి తిండి లేకున్నా..  భారత్‌ను కవ్వించే చర్యలను పాకిస్తాన్ ఆపడం లేదు. పాకిస్తాన్  మరోసారి భారత్‌కు న్యూక్లియర్ వార్నింగ్ ఇచ్చింది. ఈసారి రష్యాలోని పాకిస్తాన్ రాయబారి ముహమ్మద్ ఖలీద్ జమాలీ పిచ్చికూతలు కూశాడు. ‘‘త్వరలోనే మా దేశంపై భారత్ దాడి చేయబోతోంది. దీనిపై మాకు పక్కా సమాచారం అందింది. భారత్ మాపై దాడి చేసినా, పాకిస్తాన్‌కు రావాల్సిన నీటిని ఆపినా ఊరుకోం. అణ్వాయుధాలు సహా మా పూర్తి సైనిక శక్తిని వినియోగిస్తాం’’ అని  ముహమ్మద్ ఖలీద్ జమాలీ వ్యాఖ్యానించాడు. ‘‘సింధూ నది నుంచి పాకిస్తాన్ వైపుగా పాారే జలాలను అడ్డుకున్నా, వాటిని దారి మళ్లించినా మేం ఊరుకోం. దాన్ని యుద్ధ చర్యగా పరిగణిస్తాం. పూర్తిశక్తితో ప్రతిఘటిస్తాం’’ అని అతడు వెల్లడించాడు. రష్యాకు చెందిన ఆర్‌టీ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేశాడు.

Also Read :World Traveler Anvesh: ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌పై కేసు.. ఏం చేశాడంటే..

సింధూ నదిపై ప్రాజెక్టులు నిర్మిస్తే కూల్చేస్తాం : పాక్ 

శుక్రవారం రోజు పాకిస్తాన్‌(Nuclear Warning)కు చెందిన జియో న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ నోరు పారేసుకున్నాడు. భారత్‌పై విషం కక్కాడు. ‘‘సింధూ నదీ జలాలను ఆపేందుకు, మళ్లించేందుకు భారత్ ఏవైనా ప్రాజెక్టులను నిర్మిస్తే మేం కూల్చేస్తాం. అలాంటి నిర్మాణాలపై దాడి చేస్తాం. మా దేశపు నదీజలాలను ఆపడం కూడా యుద్ధచర్యే. దీనివల్ల పాకిస్తాన్‌లో ఆకలి, దాహంతో మరణాలు సంభవిస్తాయి’’ అని  ఖ్వాజా ఆసిఫ్ పేర్కొన్నాడు.

Also Read :856 Snakebites Vs A Man: ఇతగాడికి 856సార్లు పాముకాట్లు.. పవర్ ఫుల్ విరుగుడు రెడీ

పాకిస్తాన్ ప్రజలకు ఇక కష్టకాలమే

పై వ్యాఖ్యలు భారత్‌ను కవ్వించేలా ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది. పాకిస్తాన్ కోరుకుంటున్నది కూడా అదే. ద్రవ్యోల్బణం, పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం లాంటి సమస్యల నుంచి పాకిస్తాన్‌ ప్రజల చూపును మళ్లించేందుకే భారత్‌ను కవ్వించే ప్రయత్నాల్లో పాకిస్తాన్ ఉన్నట్లు తెలుస్తోంది. భారత్‌తో యుద్ధానికి దిగడం ద్వారా పాకిస్తాన్ ప్రజల చూపును యుద్ధం వైపునకు మళ్లించాలని పాక్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ యుద్ధంతో పాకిస్తాన్‌లో పేద ప్రజల జీవనం మరింత దుర్భరంగా తయారుకానుంది. నిత్యావసరాల ధరలు, ఇంధన ధరలు చుక్కలను అంటనున్నాయి. గోధుమ పిండికి పాకిస్తాన్‌లో తీవ్ర కొరత ఏర్పడబోతోంది.