Rishi Sunak: క్రికెట్ ఆడిన బ్రిట‌న్ ప్ర‌ధాని రిషి సునాక్‌.. వీడియో వైరల్

బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ (Rishi Sunak) తన చర్యలతో సోషల్‌ మీడియాలో మరోసారి వైరల్‌గా మారారు. టీ20 వరల్డ్‌ ఛాంపియన్స్‌గా నిలిచిన ఇంగ్లండ్‌ జట్టును తాను నివాసం ఉంటున్న 10 డౌనింగ్‌ స్ట్రీట్‌కు ఆహ్వానించారు.

  • Written By:
  • Publish Date - March 24, 2023 / 01:34 PM IST

బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ (Rishi Sunak) తన చర్యలతో సోషల్‌ మీడియాలో మరోసారి వైరల్‌గా మారారు. టీ20 వరల్డ్‌ ఛాంపియన్స్‌గా నిలిచిన ఇంగ్లండ్‌ జట్టును తాను నివాసం ఉంటున్న 10 డౌనింగ్‌ స్ట్రీట్‌కు ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో వారితో క్రికెట్ ఆడారు. ముందు బ్యాటింగ్‌లో కవర్‌ డ్రైవ్‌తో అలరించిన రిషి సునాక్‌.. జోర్డాన్‌ బంతిని పుల్‌ చేయబోయి స్లిప్‌లో క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగారు.

2022లో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై టైటిల్‌ గెలిచిన జట్టు సభ్యులంతా ఈ సందర్భంగా ఆ దేశ ప్రధానిని కలిశారు. ఈ సమయంలో రిషి సునాక్‌ కూడా ఆటగాళ్లందరితో క్రికెట్ ఆడాడు. సునాక్‌ క్రికెట్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సునాక్‌తో సహా ఇంగ్లండ్ జట్టు ఆటగాళ్లందరూ ఫార్మల్ డ్రెస్‌లో క్రికెట్ ఆడారు.

2022 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో ఇంగ్లండ్ పాకిస్థాన్‌తో తలపడింది. మ్యాచ్‌లో బౌలర్లు ఆధిపత్యం చెలాయించినప్పటికీ, చివరికి ఇంగ్లండ్ గెలిచింది. ఇంగ్లండ్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా నిలపడంలో సామ్ కరణ్ సహకారం అత్యధికం. టోర్నీ ఆద్యంతం కరణ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ముఖ్యంగా చివరి ఓవర్‌లో భీకరంగా వికెట్లు తీశాడు. వన్డే ప్రపంచకప్‌, టీ20 ప్రపంచకప్‌లను ఏకకాలంలో గెలుచుకున్న ప్రపంచంలోనే తొలి జట్టుగా ఇంగ్లండ్‌ నిలిచింది. 2019లో టీ20 వన్డే ప్రపంచకప్‌ను కూడా గెలుచుకుంది.

Also Read: Royal Challengers Bangalore: పదునెక్కిన బెంగళూరు బౌలింగ్.. హోంగ్రౌండ్ తోనే అసలు సమస్య

ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లండ్ 0-3 తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమితో జోష్ బట్లర్ జట్టు తీవ్ర విమర్శలకు గురైంది. అయితే, తమ జట్టు అద్భుతంగా పునరాగమనం చేస్తుందని బట్లర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్ జట్టు టెస్టుల్లో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ పరిమిత ఓవర్లలో ఈ జట్టు ప్రదర్శన టెస్టుల్లో అంత నిలకడగా లేదు.