Site icon HashtagU Telugu

Vladimir Putin: మరింత క్షీణించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యం

Putin Agrees To China Visit

Putin

గతేడాది రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ఆరోగ్యం చర్చనీయాంశమైంది. తాజా సమాచారం ప్రకారం పుతిన్ ఆరోగ్యం ఇటీవలి కాలంలో క్షీణించినట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్యం విషమించడం వైద్యులకు తలనొప్పిగా మారింది. మెట్రో నివేదిక ప్రకారం.. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైనప్పటి నుంచి వరుస సమీక్షలతో బిజీబిజీగా గడుపుతున్నట్లు సమాచారం. ఫలితంగా తలనొప్పి, కళ్లు మసకబారటం, తరచుగా నాలుకు తిమ్మిరిగా ఉండటం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. ఈ లక్షణాలతో బాధపడుతున్న పుతిన్‌.. కుడి చేయి, కాలుకు స్పర్శ కోల్పోవడంతో ఆయనకు వైద్యులు అత్యవసర చికిత్స అందించినట్లు వెల్లడించింది. పుతిన్‌ను చూసుకుంటున్న వైద్యులు కూడా పుతిన్ పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్నారు.

పుతిన్ కుడి చేయి, కాలులో తిమ్మిరి ఉందని నివేదిక పేర్కొంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వైద్యులకు చెప్పారు. రిపోర్ట్ ప్రకారం.. మెడిసిన్ వేసుకుని ఫస్ట్ ఎయిడ్ తర్వాత విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు పుతిన్ కు సూచించారు. వైద్యుల సలహాలను పట్టించుకోకుండా పుతిన్ నిరంతరం పని చేస్తున్నారు. మీడియా నివేదికల ప్రకారం.. పుతిన్ పరిస్థితిలో స్వల్ప మెరుగుదల ఉంది. పుతిన్ ఆరోగ్యం క్షీణించడంతో అతని బంధువులు ఆందోళన చెందుతున్నార. పుతిన్ ఆరోగ్యం మునుపటి కంటే క్షీణించింది. దీంతో ఆయన సన్నిహితులు ఒత్తిడికి గురవుతున్నారు.

Also Read: Richest Barber: ఒకప్పుడు తినడానికి కనీసం తిండి లేదు.. కానీ ఇప్పుడు ప్రపంచంలోనే రిచెస్ట్ బార్బర్

పుతిన్ ఆరోగ్యం క్షీణించిందా..?

70 ఏళ్ల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల కొత్త చికిత్స చేయించుకోనున్నట్లు రష్యన్ టెలిగ్రామ్ ఛానెల్ జనరల్ ఎస్‌విఆర్‌ లో పేర్కొన్నట్లు మిర్రర్ నివేదించింది. అతని ఆరోగ్యం క్షీణించింది. వ్లాదిమిర్ పుతిన్ క్యాన్సర్‌తో సహా కొన్ని తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్నారని మీడియా నివేదికలు గతంలో పేర్కొన్నాయి. రష్యా అధ్యక్షుడికి క్యాన్సర్‌తో పాటు అనేక ఇతర వ్యాధులు ఉన్నాయి. అతను దగ్గు, తల తిరగడం, నిద్ర భంగం, కడుపు నొప్పితో బాధపడుతున్నాడు.