Site icon HashtagU Telugu

Hijack Video : కార్గో షిప్‌ను హౌతీలు హైజాక్‌ చేసిన వీడియో

Hijack Video

Hijack Video

Hijack Video : గాజాపై బాంబుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించిన యెమన్ దేశానికి చెందిన హౌతీ మిలిటెంట్లు చెప్పినట్టే చేశారు. రెండు రోజుల క్రితం టర్కీ నుంచి భారత్‌కు బయలుదేరిన  ‘గెలాక్సీ లీడర్‌’ అనే భారీ కార్గో షిప్‌‌ను హైజాక్‌ చేశారు. ఆ కార్గోషిప్ బ్రిటీష్ కంపెనీది కాగా.. ఆ కంపెనీలో పార్ట్‌నర్‌గా ఇజ్రాయెలీ బిలియనీర్ ఒకరు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ నౌకను జపాన్‌కు చెందిన ఒక కంపెనీ లీజుకు తీసుకొని నడుపుతోంది. ఏది ఏమైనప్పటికీ ఆ నౌకను సినీ ఫక్కీలో హౌతీ మిలిటెంట్లు హెలికాప్టర్‌లో వచ్చి హైజాక్ చేసి తీసుకెళ్లారు. ఇదంతా ఎలా చేశారనే దానికి సంబంధించిన ఒక వీడియోను హౌతీ మిలిటెంట్లు(Hijack Video) విడుదల చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

హెలికాప్టర్‌లో వచ్చిన హౌతీ మిలిటెంట్లు తొలుత ఓడ డెక్‌పై దిగారు. ఆ తర్వాత నినాదాలు చేస్తూ.. గాలిలోకి కాల్పులు జరుపుతూ అక్కడున్నవారిని తమ అదుపులోకి తీసుకున్నారు. ఓడను కంట్రోల్‌లోకి తీసుకొని యెమన్ తీరం వైపుగా తీసుకెళ్లారు. హమాస్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం నేపథ్యంలో గాజా ప్రజల ప్రాణాలు తీస్తున్న ఇజ్రాయెల్‌కు చెందిన నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని ఇటీవలే హౌతీ మిలిటెంట్లు ప్రకటన విడుదల చేశారు. అయితే ఆ నౌక తమది కాదని, అందులో ఇజ్రాయెలీ పౌరులు లేరని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఈ నౌకలో బల్గేరియా, ఫిలిప్పీన్స్‌, మెక్సికో, ఉక్రెయిన్‌కు చెందిన 25 మంది సిబ్బంది ఉన్నారు.

Also Read: Ginger Side Effects: అల్లం ఎక్కువగా వాడితే అనర్థాలే.. సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఇవే..!