Mexico Floods : ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు ప్రకృతి ప్రళయానికి దిగ్గజంగా తలొగ్గుతోంది. ఇటీవల టెక్సాస్ రాష్ట్రాన్ని వణికించిన భారీ వర్షాలు, వరదలు ఇప్పుడు మరోవైపు పొరుగుదేశమైన మెక్సికోను సైతం ముంచెత్తాయి. రెండు దేశాల్లో వరుసగా సంభవించిన ఈ ప్రకృతి విపత్తులు వందలాది కుటుంబాలను దెబ్బతీశాయి. వందలకుపైగా ప్రాణాలు కోల్పోయారు, ఇంకా అనేక మంది గల్లంతయ్యారు.
గత వారం జూన్ 4న తెల్లవారుజామున టెక్సాస్‌లో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర ప్రాణనష్టం కలిగించాయి. ఇప్పటి వరకు 109 మంది మృతిచెందినట్టు అధికారిక సమాచారం. మరో 160 మందికి పైగా వ్యక్తుల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. అర్థరాత్రి సమయంలో వచ్చిన వరదలు అనేక ప్రాంతాల్లోని నివాసాలను గల్లంతు చేశాయి. ప్రజలు నిద్రలే లేనంత వేగంగా ప్రవహించిన వరదలు తమ అంతకంతకూ పెరుగుతూ పెద్ద కరాళ రూపం దాల్చాయి. వేసవి సెలవుల్లో క్యాంపులకు వెళ్లిన పిల్లలు, కుటుంబాల ఆచూకీ ఇంకా కనబడకపోవడం స్థానికులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
Mega PTM 2.0: గిన్నిస్ రికార్డు కొట్టబోతున్న మెగా పేరెంట్-టీచర్ మీట్ 2.0
అమెరికా వరద బీభత్సం నుంచి ఇంకా కోలుకోకముందే, మెక్సికోలోనూ ప్రకృతి మరో దెబ్బ కొట్టింది. కుండపోత వర్షాలతో నదులు ఉప్పొంగి పలు ప్రాంతాల్లో ప్రళయం సృష్టించాయి. ముఖ్యంగా రియో రుయిడోసో నది 20 అడుగుల ఎత్తుతో ప్రవహిస్తుండటం అత్యంత ప్రమాదకరంగా మారింది. వరదల్లో ఇళ్లు, వాహనాలు, చెట్లు, చెరువుల వెంట ఉన్న నిర్మాణాలు అన్నీ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి.
ఇప్పటి వరకు ఈ వరదల కారణంగా ఇద్దరు చిన్నారులతో పాటు ముగ్గురు మృతిచెందినట్టు సమాచారం. అనేకమంది ప్రజలు గల్లంతయ్యారని మెక్సికో మేయర్ లిన్ క్రాఫోర్డ్ తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం అత్యవసర సహాయక చర్యలు ప్రారంభించింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఎమర్జెన్సీ పరిస్థితిని ప్రకటించారు.
టెక్సాస్, మెక్సికోల్లో వరదల దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నీటిలో కొట్టుకుపోతున్న ఇళ్లు, కార్లు, చెట్లు.. ఈ విపత్తు ఎంత తీవ్రంగా ఉందో చాటుతున్నాయి. సహజంగా గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పుల వల్ల ఏర్పడుతున్న ఈ విపత్కర పరిస్థితులపై ప్రజలలో కూడా ఆందోళన మొదలైంది.
ఈ రెండు వరదల ప్రభావం నుంచి ప్రజలు ఎప్పుడు కోలుకుంటారో తెలియదు. అధికార యంత్రాంగం ఎంత వేగంగా స్పందిస్తున్నా, ప్రకృతి తాకిడి ముందు మానవ ప్రయత్నాలు కొద్దిగా ఆలస్యం అవుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది.
Indian-Origin Sabih Khan: ఆపిల్ కంపెనీకి సీవోవోగా ఉత్తరప్రదేశ్ వ్యక్తి.. ఎవరీ సబీహ్ ఖాన్?