US Shooting: అమెరికాలో కాల్పుల ఘటనలు రోజురోజుకు ఎక్కువవుతూ ఉన్నాయి. ఇందులో ఎక్కువగా యువత ఉండటం గమనార్హం. అమెరికా టెక్సాస్‌లో కాల్పుల మోత మోగించారు. టెక్సాస్ లోని క్లీవ్‌ల్యాండ్‌లో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మరణించారు. గత ఐదు రోజుల్లో కాల్పుల్లో 10 మందికి పైగా మరణించారు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాలో కాల్పుల ఘటలను ఎందుకు నియంత్రించడం లేదన్న ప్రశ్న తలెత్తుతోంది.
అమెరికాలో కాల్పులకు ప్రధాన కారణం ప్రతి రెండు కుటుంబంలో ఒకరికి తుపాకీ ఉంటుందట. ఒక నివేదిక ప్రకారం అమెరికాలో ప్రతి 100 మందిలో 88 మందికి తుపాకీ ఉన్నది. ఇటీవల, అమెరికాలో తుపాకీ యజమానుల సంఖ్య మరింత పెరిగింది. ఒక నివేదిక ప్రకారం USలో జనవరి 2019 మరియు ఏప్రిల్ 2021 మధ్య, 7.5 మిలియన్ల మంది ప్రజలు కొత్తగా తుపాకులను కొనుగోలు చేశారు. 2017 వరకు ఉన్న నివేదికల ప్రకారం,1.5 మిలియన్లకు పైగా ప్రజలు కాల్పుల్లో మరణించారు. అమెరికా 1775 స్వాతంత్ర్య యుద్ధంలో మరణించిన వారి సంఖ్య తర్వాత ఈ సంఖ్య అత్యధికం. 2020 సంవత్సరంలోనే 45000 మందికి పైగా దీని కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
అమెరికాలో తుపాకులపై నియంత్రణ ఎందుకు లేదన్నదే అందరిలో మెదులుతున్న ప్రశ్న. దీనికి ప్రధాన కారణం రాజకీయాలే.. సామాన్య ప్రజలు కూడా తుపాకీని కలిగి ఉండటం తమ హక్కుగా భావిస్తారు.ఏ ప్రభుత్వమూ దీన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవడం లేదు. అదే సమయంలో నేషనల్ రైఫిల్ అసోసియేషన్ (NRA) కూడా అమెరికాలో తుపాకీ నిర్వహణకు మద్దతు ఇచ్చే పెద్ద లాబీగా పరిగణించబడుతుంది.
అమెరికాలో కాల్పులకు పాల్పడిన చాలా మంది దోషులు తాము హింసాత్మక వీడియో గేమ్‌లకు బానిసలయ్యారని, రోజుకు 15 గంటలు ఆడేవారని ఒప్పుకున్నారని అక్కడి మీడియా చెప్పింది. 2012లో US పాఠశాలలో 26 మంది పిల్లలు మరియు సిబ్బందిని చంపిన ఆడమ్ లాంజా కూడా వీడియో గేమ్‌లకు బానిసైనట్లు అంగీకరించాడు.
Read More: MS Dhoni: చెపాక్ వేదికగా మాహీ సిక్సులు వరద