US Nuclear Submarine : ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం తీవ్రరూపు దాలుస్తోంది. గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తుండగా.. మరోవైపు ఇజ్రాయెల్ లక్ష్యంగా యెమన్‌కు చెందిన హౌతీ మిలిటెంట్లు, లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా మిలిటెంట్లు దాడులు చేస్తున్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్‌కు రక్షణ కల్పించేందుకు అమెరికాకు చెందిన రెండు విమాన వాహక యుద్ధనౌకలు ఇజ్రాయెల్ సముద్రతీరంలో నిలబడి ఉన్నాయి. ఇప్పుడు తాజాగా అమెరికాకు చెందిన న్యూక్లియర్ సబ్ మెరైన్ (అణు జలాంతర్గామి) రంగంలోకి దిగింది. అది మిడిల్ ఈస్ట్‌కు చేరుకుంది. అయితే మిడిల్ ఈస్ట్‌లో ఏ స్థావరానికి అది చేరిందనే దానిపై క్లారిటీ లేదు. ఓహియో క్లాస్ అణు జలాంతర్గామిని మిడిల్ ఈస్ట్‌లో ల్యాండ్ చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ అధికారికంగా ప్రకటించింది. సూయజ్ కెనాల్ మీదుగా అణు జలాంతర్గామి జర్నీ చేస్తున్న ఒక ఫొటోను రిలీజ్ చేసింది. ఈమేరకు ట్విట్టర్‌లో ఒక పోస్ట్ చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
On November 5, 2023, an Ohio-class submarine arrived in the U.S. Central Command area of responsibility. pic.twitter.com/iDgUFp4enp
— U.S. Central Command (@CENTCOM) November 5, 2023
ఇజ్రాయెల్‌పై ఏదైనా దేశం దాడికి యత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయనే సంకేతాలు ఇచ్చేందుకు అణు జలాంతర్గామిని అమెరికా రంగంలోకి దింపిందని పరిశీలకులు అంటున్నారు. ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధంలో జోక్యం చేసుకోవద్దని రష్యా, ఇరాన్‌లకు తీవ్ర హెచ్చరికలు పంపేందుకే ఇలాంటి నిర్ణయాలను అమెరికా తీసుకుంటోందని చెబుతున్నారు. ‘‘మేము చేయాల్సినవన్నీ చేస్తాం. అమెరికా దళాలను కాపాడుకుంటాం. విదేశాలలో మా ప్రయోజనాలను కూడా కాపాడుకుంటాం. అవే మాకు ముఖ్యం. మరేం పట్టించుకోం’’ అని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ బ్రిగేడియర్ జనరల్ పాట్ రైడర్ ఇటీవల(US Nuclear Submarine) వెల్లడించారు.
Also Read: Bangladesh Vs Sri Lanka : బంగ్లా-శ్రీలంక మ్యాచ్ వాయిదా ?