Site icon HashtagU Telugu

US- India Deal: అమెరికా-భారత్ మధ్య రెండు భారీ డీల్స్‌!

US- India Deal

US- India Deal

US- India Deal: భారత్ తన భద్రతా దళాలను బలోపేతం చేసుకుంటోంది. ఒకవైపు బ్రహ్మోస్ క్షిపణులను ఇతర దేశాలకు విక్రయిస్తుండగా, మరోవైపు అమెరికాతోనూ (US- India Deal) పెద్ద డీల్స్ ఖరారు చేస్తోంది. తాజాగా అమెరికా భారత్‌తో రెండు పెద్ద ఒప్పందాలకు ఆమోదం తెలిపింది. వీటిలో ఒకటి జావెలిన్ యాంటీ-ట్యాంక్ క్షిపణి వ్యవస్థ కాగా.. మరొకటి ఎక్స్‌కాలిబర్ ప్రొజెక్టైల్. జావెలిన్ క్షిపణిని ప్రస్తుతం ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ఉపయోగిస్తున్నారు. ఇది పెద్దపెద్ద ట్యాంకులను సైతం సులువుగా ధ్వంసం చేయగలదు.

భారత్‌కు జావెలిన్ యాంటీ-ట్యాంక్ క్షిపణులను విక్రయించడానికి అమెరికా ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని అమెరికా రక్షణ భద్రతా సహకార సంస్థ ప్రకటించింది. ఈ రెండు డీల్స్ మొత్తం విలువ 93 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 780 కోట్లు). వీటిలో జావెలిన్ క్షిపణి వ్యవస్థ, ఎక్స్‌కాలిబర్ ప్రొజెక్టైల్ ఉన్నాయి. జావెలిన్ క్షిపణులను ప్రస్తుతం ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ఉపయోగిస్తున్నారు.

Also Read: Sanju Samson: తొలిసారి సీఎస్కే జెర్సీలో క‌నిపించిన సంజు శాంస‌న్‌!

జావెలిన్ క్షిపణి వ్యవస్థ అంటే ఏమిటి?

జావెలిన్ క్షిపణి ఇటీవల ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో చర్చనీయాంశమైంది. ఇది ఒక అధునాతన పోర్టబుల్ యాంటీ-ట్యాంక్ గైడెడ్ క్షిపణి (ATGM). దీనిని అమెరికాకు చెందిన లాక్‌హీడ్ మార్టిన్ (Lockheed Martin), రేథియాన్ (Raytheon/RTX) కంపెనీలు తయారు చేశాయి. దీనిని ‘ఫైర్ అండ్ ఫ‌ర్‌గేట్‌’ క్షిపణి అని అంటారు. అంటే లక్ష్యాన్ని లాక్ చేసిన తర్వాత ప్రయోగించినవారు దాని గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. అది తనంతట తానుగా లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఈ క్షిపణి లక్ష్యాన్ని గుర్తించి దాడి చేస్తుంది. ఉక్రెయిన్, రష్యాకు చెందిన అనేక ట్యాంకులను ధ్వంసం చేయడానికి ఈ క్షిపణినే ఉపయోగించింది.

ఎక్స్‌కాలిబర్ ప్రొజెక్టైల్ అంటే ఏమిటి?

భారత్‌కు ఎక్స్‌కాలిబర్ ప్రొజెక్టైల్స్ (ఆర్టిలరీ షెల్స్), వాటికి సంబంధించిన పరికరాలను విక్రయించడానికి అమెరికా విదేశాంగ శాఖ ఆమోదం తెలిపింది. దీని అంచనా విలువ సుమారు 47.1 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 400 కోట్లు). ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సైన్యం దీనిని ఉపయోగించింది.

Exit mobile version