Kash Patel : చరిత్రలో తొలిసారిగా, అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎఫ్‌బీఐ)కి భారత సంతతికి చెందిన వ్యక్తి నేతృత్వం వహించబోతున్నారు. కాష్యప్ ‘కాష్’ పటేల్ ఇప్పుడు ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అమెరికా సెనెట్ 51-49 ఓట్ల తేడాతో ఆయన నియామకాన్ని ఆమోదించింది. రిపబ్లికన్ పార్టీ సెనెటర్లు పెద్ద ఎత్తున ఆయనకు మద్దతు తెలిపారు, కానీ డెమోక్రటిక్ పార్టీ సెనేటర్లు సుసన్ కోలిన్స్, లిసా ముర్కోవ్క్కీ మాత్రం ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈ నేపథ్యంలో, పటేల్ మాట్లాడుతూ, ఎఫ్‌బీఐ రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుందని, రాజకీయ ప్రత్యర్థులపై ప్రతీకార చర్యలు ఎవరూ తీసుకోబోరు అని హామీ ఇచ్చారు. ఆయన లక్ష్యం ఎఫ్‌బీఐపై ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంచడమేనని చెప్పారు. “అమెరికాకు హానిచేస్తే, ఎక్కడ ఉన్నా వేటాడి, వారిని మట్టుపెట్టే ధీమా” అని ఆయన హెచ్చరించారు.
కాష్ పటేల్ అమెరికాలో డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత విశ్వసనీయుడిగా భావించబడతారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రభుత్వ శాఖల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రత్యేకంగా న్యాయశాఖ, ఎఫ్‌బీఐలో, ట్రంప్ పాలనలో సుమారు 75 మంది లాయర్లు, ఇతర అధికారులు రాజీనామా చేశారు. కొన్ని చోట్ల, ట్రంప్ ప్రభుత్వం స్వయంగా వారి పదవులను తొలగించింది, మరికొందరిని ఇతర విభాగాలకు బదిలీ చేసింది. ఈ స్థాయిలో మార్పులు చోటుచేసుకోవడం, అక్కడి రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.
Gold Price Today : మగువలకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..
ట్రంప్ తన విధానాల్ని, లక్ష్యాల్ని నెరవేర్చటానికి న్యాయశాఖ, ఇతర శాఖల అధిపతుల్ని తనవైపు మరింత ఆకర్షించాలని ఆశిస్తున్నట్లు కనిపిస్తుంది. న్యాయశాఖ ఇప్పటికే, ట్రంప్‌కు సంబంధించిన అక్రమ వలసల విధానాన్ని సమర్థించడం, ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ నేత ఎరిక్ ఆడమ్స్‌పై అవినీతి కేసును తొలగించేందుకు సిద్ధమైంది. ఇది కూడా ఒక కీలక మార్పుగా గుర్తించబడింది.
అయితే, ట్రంప్ న్యాయశాఖ పనితీరుపై నేరుగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, 2016 నాటి తన ఎన్నికల ప్రచార కార్యాచరణతో పాటు, రెండు ఫెడరల్ క్రిమినల్ కేసులపై సత్వర విచారణకు ముందుకు రాకుండా వాటిని పక్కన పెట్టించాడు. ఈ నేపథ్యంలో, న్యాయశాఖ అధికారి ఛాడ్ మిజిల్ స్పష్టం చేశారు. “ప్రమాదకరమైన నేరగాళ్లకు శిక్ష పడేలా చేయడమే ప్రధాన అజెండా. రాజకీయ దురుద్దేశాలతో ఎలాంటి దర్యాప్తు జరగదు” అని ఆయన చెప్పారు.
ట్రంప్ కేసులపై పని చేసిన న్యాయశాఖ అధికారులు, తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లూ లేవని, తమ పని పూర్తిగా న్యాయపరమైన దృష్టితో మాత్రమే ఉందని తెలిపారు.