Site icon HashtagU Telugu

US Vs Iran : ఇజ్రాయెల్‌పై దాడికి పర్యవసానం.. ఇరాన్‌పై అమెరికా ఆంక్షల కొరడా

Us Vs Iran Us Sanctions Iran Missile Attack

US Vs Iran : తన మిత్రదేశం ఇజ్రాయెల్‌పై  180 మిస్సైళ్లతో దాడికి పాల్పడినందుకు ఇరాన్‌పై అమెరికా ఆంక్షల కొరడా ఝుళిపించింది.  ఇరాన్‌కు చెందిన పెట్రోలియం, పెట్రో కెమికల్‌ రంగాలపై గతంలో విధించిన ఆంక్షలను మరింతగా విస్తరిస్తున్నట్లు అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌ ప్రకటించింది. ఇందులో భాగంగా ఇరాన్‌కు చెందిన 16 సంస్థలను, 17 నౌకలను బ్లాక్‌ ప్రాపర్టీగా గుర్తించినట్లు వెల్లడించింది. ఆ సంస్థలు నేషనల్‌ ఇరానియన్‌ ఆయిల్‌ కంపెనీకి మద్దతుగా ఇరానియన్‌ పెట్రోలియం, పెట్రోకెమికల్‌ ఉత్పత్తులను రవాణా చేస్తున్నాయని తెలిపింది.

Also Read :AR Rahman : కమలకు మద్దతుగా రెహమాన్.. ఓటర్లకు 30 నిమిషాల మ్యూజిక్ మెసేజ్

ఇరాన్‌కు ప్రధాన ఆదాయం ముడి చమురు నుంచే లభిస్తుంది. ఇరాన్‌లో(US Vs Iran) చాలా ఆయిల్ రిఫైనరీలు ఉన్నాయి. వాటిలో ప్రాసెస్ అయ్యే ముడి చమురు చాలా ప్రపంచ దేశాలకు సప్లై అవుతుంటుంది. అమెరికా ఆంక్షలు ఉన్నందున ఈ ముడి చమురును చాలా ఐరోపా దేశాలు, అమెరికా కొనవు. కానీ భారత్, చైనా, పాకిస్తాన్‌ , ఉత్తర కొరియా వంటి ఇరాన్‌ మిత్రదేశాలు మాత్రం ముడిచమురును కొంటున్నాయి. అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇరాన్ నుంచి ఈ దేశాలు ముడిచమురును కొంటున్నాయి. ఎందుకంటే ఇతర అరబ్ దేశాలతో పోలిస్తే ఇరాన్ నుంచి ముడి చమురు చాలా తక్కువ ధరకు లభిస్తుంది. అంతేకాదు.. ఇరాన్ తమ ముడి చమురును కొనే దేశాల స్థానిక కరెన్సీ తీసుకొని ఆయిల్ అమ్ముతుంది. ఆ కరెన్సీతో ఆయా దేశాల నుంచి వివిధ రకాల వస్తువులు, సేవలను దిగుమతి చేసుకుంటుంది. ప్రస్తుతానికి ఇరాన్ ముడిచమురును అత్యధికంగా కొంటున్న దేశం చైనా. ఇరాన్‌కు చాలా రకాల సైనిక టెక్నాలజీలను చైనా, రష్యాలు రహస్యంగా సప్లై చేస్తున్నట్లు చెబుతారు. పశ్చిమాసియాలో అమెరికా ప్రతినిధి ఇజ్రాయెల్‌కు ధీటుగా ఇరాన్‌ను నిలబెట్టేందుకు రష్యా, చైనాలు సీక్రెట్ ఎజెండాతో పనిచేస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఈ తరుణంలో అమెరికా ఆంక్షల ప్రభావం ఇరాన్‌పై పెద్దగా ఉండదని స్పష్టం చేస్తున్నారు.

Also Read :US Vs Iran : ఇరాన్ ఆయుధాల నౌక వర్సెస్ అమెరికా.. నేవీ సీల్స్ మరణంపై కొత్త అప్‌డేట్

Exit mobile version