Site icon HashtagU Telugu

Ilhan Omar: భారత వ్యతిరేక ఎంపీ ఇల్హాన్‌ ఒమర్‌కు షాక్.. కీలక కమిటీ నుంచి ఔట్

Ilhan Omar

Resizeimagesize (1280 X 720) (1) 11zon

అమెరికా ప్రతినిధుల సభలో డెమొక్రటిక్‌ పార్టీ సభ్యురాలు ఇల్హాన్‌ ఒమర్‌కు (Ilhan Omar) రిపబ్లికన్లు షాకిచ్చారు. అత్యంత శక్తిమంతమైన హౌస్‌ ‘ఫారెన్‌ అఫైర్స్‌ కమిటీ’ నుంచి తొలగించారు. ఆమె 2019లో ఇజ్రాయెల్‌, యూదులకు వ్యతిరేకంగా చేసిన ప్రకటనల చూస్తే కమిటీలో ఉండటానికి అర్హురాలు కాదని రిపబ్లికన్‌ పార్టీ సభ్యులు వాదించారు. కాగా, గతేడాది ఇల్హాన్‌ ఒమర్‌ భారత్‌-అమెరికా సంబంధాలు దెబ్బతినేలా ప్రవర్తించేలా వ్యాఖ్యలు చేశారు.

ఎంపీ ఇల్హాన్ ఒమర్‌పై యూఎస్ హౌస్ చర్యలు తీసుకుంది. ఇజ్రాయెల్‌పై చేసిన వ్యాఖ్యల కారణంగా ఆమెను విదేశీ వ్యవహారాల కమిటీ నుంచి తొలగించారు. గురువారం (ఫిబ్రవరి 2) హౌస్ ఓటింగ్ తర్వాత మిన్నెసోటా డెమోక్రటిక్ ప్రతినిధి ఇల్హాన్ ఒమర్‌ను ఫారిన్ అఫైర్స్ ప్యానెల్ నుండి తొలగించింది. అదే సమయంలో వైట్ హౌస్ ఈ చర్యను ఖండించింది. ఇల్హాన్ ఒమర్‌ను తొలగించాలని ఇజ్రాయెల్ గురించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను యుఎస్ హౌస్ ఉదహరించింది.

Also Read: 13 Killed: అటవీ ప్రాంతంలో మంటలు.. 13 మంది మృతి

వ్యతిరేక వ్యాఖ్యలపై విదేశీ వ్యవహారాల కమిటీ నుండి వివాదాస్పద డెమొక్రాట్‌ను తొలగించేందుకు US ప్రతినిధుల సభ గురువారం (2 ఫిబ్రవరి) ఓటు వేసింది. మాజీ సోమాలి శరణార్థి ఇల్హాన్ ఒమర్ 2012 నుండి ఇజ్రాయెల్ గురించి అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు, వీటిని అన్ని పార్టీలు ఖండించాయి. యుఎస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ నుండి ఆమెను తొలగించే ముందు ఇల్హాన్ ఒమర్ మాట్లాడుతూ.. తాను ఒక్కసారి ఈ కమిటీలో లేనంతమాత్రాన.. గళాన్ని, నాయకత్వాన్ని అణచివేయలేరు. అవి బిగ్గరగా మారతాయని అన్నారు.

ఫిబ్రవరి 2న ఓటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రతినిధుల సభ స్పీకర్ కెవిన్ మెక్‌కార్తీ.. విదేశీ వ్యవహారాల కమిటీ చాలా కీలకమైనది. సున్నితమైన విదేశీ సంబంధాలను పర్యవేక్షించే ఆ కమిటీలో బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేస్తున్న ఇల్హాన్ ఒమర్ వంటి ఎంపీ సభ్యురాలిగా ఉండడం సరికాదని భావిస్తున్నాం అని అన్నారు. ఆమెను కమిటీ నుంచి తొలగించాలన్న ప్రతిపాదనకు 218 అంగీకారం తెలపగా, 211 మంది వ్యతిరేకించారు. మరోవైపు ఈ చర్యను అమెరికా వైట్‌హౌస్ విమర్శించింది. శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ మాట్లాడుతూ.. ఇది రాజకీయ కుట్రగా భావిస్తున్నాం. ఇటీవలి వారాల్లో ప్రతినిధుల సభలో రిపబ్లికన్ పార్టీ చట్టసభ సభ్యులు అనేక కీలక కమిటీల నుండి ఇతర కీలకమైన డెమొక్రాటిక్ పార్టీ శాసనసభ్యులు అన్యాయంగా తొలగించబడ్డారు. ఇది అమెరికా ప్రజలను అవమానించడమే అని అన్నారు.