US Vs Russia : అగ్ర రాజ్యాలు అమెరికా – రష్యాల మధ్య ప్రస్తుతం యుద్ధ వాతావరణం ఉంది. ఇటీవలే బైడెన్ తీసుకున్న ఒక వివాదాస్పద నిర్ణయంతో ఇరుదేశాల మధ్య గ్యాప్ మరింత పెరిగింది. తాము విక్రయించిన లాంగ్ రేంజ్ మిస్సైళ్లను రష్యాపైకి ప్రయోగించేందుకు ఉక్రెయిన్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అనుమతులు మంజూరు చేశారు. దీంతో ఉక్రెయిన్ ఆరు లాంగ్ రేంజ్ మిస్సైళ్లను రష్యా పైకి ప్రయోగించింది. వాటిలో ఐదింటిని కూల్చేశామని, ఇంకో దాన్ని ధ్వంసం చేశామని రష్యా ప్రకటించింది. ఈ పరిణామం జరిగినప్పటి నుంచి అమెరికాపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తమ దేశంపై అమెరికా, నాటో కూటమి దేశాల లాంగ్ రేంజ్ మిస్సైళ్లతో దాడి చేస్తే.. దాన్ని మూకుమ్మడి దాడిగా పరిగణించి ప్రతిఘటిస్తామని పుతిన్ వెల్లడించారు. ఈమేరకు రష్యాకు చెందిన అణ్వాయుధ వినియోగ పాలసీలో మార్పులు చేయించి, ఆ ఫైలుపై ఇటీవలే పుతిన్ సంతకం కూడా చేశారు.
Also Read :Upasana : అయ్యప్ప మాలలో కడప దర్గాకు రామ్‌చరణ్.. విమర్శలపై ఉపాసన రియాక్షన్
ఈ పరిణామంతో అమెరికా అలర్ట్ అయింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఉన్న తమ ఎంబసీని తాత్కాలికంగా మూసివేసింది. దీనిపై అమెరికా ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. బుధవారం రోజు (నవంబరు 20న) రష్యా వైమానిక దాడులు చేసే ముప్పు ఉన్నందున కీవ్‌లోని తమ ఎంబసీని మూసివేశామని వెల్లడించింది. ఎంబసీలో(US Vs Russia) పనిచేసే ఉద్యోగులంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లారని తెలిపింది. ఉక్రెయిన్ ప్రభుత్వం ఎయిర్ అలర్ట్‌లు ప్రకటించగానే కీవ్‌లోని అమెరికా పౌరులు షెల్టర్లలో దాచుకోవాలని సూచించింది. రష్యా వైమానిక దాడులు చేస్తుందనే భయంతో నాటో కూటమిలో ఉన్న ఐరోపా దేశాలు కూడా ప్రస్తుతం అలర్ట్ మోడ్‌లో ఉన్నాయి. చిన్న పిల్లల ఆహార పదార్థాలు, ఔషధాలు, తాగునీటిని నిల్వ చేసుకోవాలని పలు నాటో దేశాలు తమ ప్రజలకు ఇప్పటికే సూచనలు జారీ చేశాయి. ఆయా దేశాలు సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశాయి. గగనతల రక్షణ వ్యవస్థలను రెడీ చేసి ఉంచాయి.