Trump Vs Transgenders : ఓ వైపు భారతదేశంలో ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగాలు ఇస్తుంటే.. మరోవైపు అగ్రరాజ్యం అమెరికాలో ట్రాన్స్‌జెండర్లకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రాన్స్‌జెండర్ల విషయంలో మరో కీలక నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చారు. అమెరికా మిలిటరీ విభాగంలో ట్రాన్స్‌జెండర్ల నియామకాన్ని బ్యాన్ చేశారు. ఈవిషయాన్ని అమెరికా ఆర్మీ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించింది. ఇప్పటికే అమెరికా సైనిక సర్వీసులో ఉన్నవారు లింగమార్పిడి చేసుకోవడానికి అనుమతులు ఇచ్చేది లేదని వెల్లడించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వచ్చాయని తెలిపింది.
Also Read :JC Prabhakar Reddy : జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాధవీలత మరో ఫిర్యాదు.. ఆరోపణలివీ
మొదటి నుంచీ ట్రంప్..
అమెరికాకు సేవ చేయాలని భావించే జెండర్ డిస్ఫోరియా వ్యక్తులను తాము గౌరవిస్తామని అమెరికా ఆర్మీ స్పష్టం చేసింది. తమను తాము ట్రాన్స్‌జెండర్‌గా భావించే వారి నియామకాలను మాత్రం ఆపేస్తామని తేల్చి చెప్పింది. మహిళల క్రీడా పోటీల్లో ట్రాన్స్‌జెండర్‌లు పాల్గొనడాన్ని ఇటీవలే డొనాల్డ్ ట్రంప్(Trump Vs Transgenders) బ్యాన్ చేశారు. ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్షుడు అయిన టైంలో సాయుధ దళాల్లో ట్రాన్స్‌జెండర్లు చేరకుండా ఆదేశాలు ఇచ్చారు. అయితే అప్పటికే మిలిటరీలో ఉన్న ట్రాన్స్‌జెండర్లను విధుల్లో కొనసాగించారు. మొత్తం మీద మొదటి నుంచీ ట్రాన్స్‌జెండర్లకు ట్రంప్ వ్యతిరేకంగానే ఉన్నారు. ఈవిషయం ఆయన ఆదేశాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
Also Read :Rent A Boyfriend : బిర్యానీ రేటుకే అద్దెకు బాయ్‌ఫ్రెండ్.. పోస్టర్లు వైరల్.. నెటిజన్ల ఆగ్రహం
మహిళల బాత్‌రూమ్‌లలోకి..
కొన్ని నెలల క్రితం ఒలింపిక్స్ క్రీడల్లో అల్జీరియాకు చెందిన ఇమానె ఖెలిఫ్ విషయంలో లింగ వివాదం నడిచింది. ఆ అంశంపై అప్పట్లో స్పందించిన డొనాల్డ్ ట్రంప్, మహిళల ఆటలో పురుషులు లేకుండా చేస్తానన్నారు. ఆనాడు చెప్పిన విధంగానే.. అమెరికా అధ్యక్ష హోదాలో నిర్ణయం తీసుకున్నారు. మహిళల క్రీడా పోటీల్లో ట్రాన్స్‌జెండర్‌లు పాల్గొనడాన్ని బ్యాన్ చేశారు. ఇటీవలే అమెరికా ఎన్నికల్లో విపక్ష డెమొక్రటిక్ పార్టీ తరఫున ట్రాన్స్‌జెండర్ సారా మెక్‌బ్రైడ్ గెలిచారు. ఆమెను అమెరికా కాంగ్రెస్ సభలోని మహిళల బాత్‌రూమ్‌లలోకి అనుమతించేది లేదని అధికార రిపబ్లికన్ పార్టీ సభ్యులు ప్రత్యేక తీర్మానం చేయడం చర్చనీయాంశంగా మారింది.