Site icon HashtagU Telugu

US Airport Worker Die: విమానం ఇంజిన్‌ గుంజేయడంతో ఎయిర్‌పోర్ట్ ఉద్యోగి మృతి

Emergency Landing

Emergency Landing

అమెరికాలోని అలబామాలో ఓ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎయిర్ పోర్ట్ ఉద్యోగి మృతి(US Airport Worker Die) చెందాడు. డిసెంబరు 31న అలబామాలోని మోంట్‌గోమెరీ ప్రాంతీయ విమానాశ్రయంలో ఒక విమానాశ్రయ కార్మికుడు విమానం ఇంజిన్‌లో చిక్కుకుని మరణించాడు. ఈ విమానం సబ్సిడీ అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానమని వార్తా సంస్థలు పేర్కొన్నాయి. మోంట్‌గోమేరీ ప్రాంతీయ విమానాశ్రయంలో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ ఘటన జరిగింది. ఉద్యోగి సామాను హ్యాండ్లర్‌గా ఉన్నారు. శనివారం మధ్యాహ్నం విమానం డల్లాస్‌కు వెళ్లాల్సి ఉంది.

అయితే విమానం దాని పార్కింగ్ బ్రేక్ సెట్ లో ఉన్నప్పుడు ఓ విమాన కార్మికుడు ఎంబ్రేయర్ 170 ఇంజిన్‌లోకి ప్రమాదవశాత్తు లొక్కొబడ్డాడు. మోంట్‌గోమెరీ రీజినల్ ఎయిర్‌పోర్ట్ ట్వీట్ చేస్తూ.. ఏఏ/పీడ్‌మాంట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఒక సభ్యుడు విషాదకరమైన ఘటనలో మృత్యువాత పడడం విన్నాం. మరణానికి చాలా బాధపడ్డాం అని విమానాశ్రయం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, వేడ్ డేవిస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబానికి సాయం చేయమని దేవుడిని ప్రార్థిస్తున్నాం అని ఆయన అన్నారు.

రాయిటర్స్ నివేదిక ప్రకారం.. US ఏజెన్సీలు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ ఈ విషయాన్ని దర్యాప్తు చేస్తాయి. అమెరికన్ ఎయిర్‌లైన్స్ గ్రూప్‌కు చెందిన పూర్తి అనుబంధ సంస్థ అయిన ఎన్వోయ్ ఎయిర్ ఈ విమానాన్ని నడుపుతుందని రాయిటర్స్ నివేదిక తెలిపింది. మరణించిన వ్యక్తి మరొక US ప్రాంతీయ అనుబంధ సంస్థ అయిన పీడ్‌మాంట్ ఎయిర్‌లైన్స్‌లో గ్రౌండ్ సిబ్బంది అని కూడా నివేదిక పేర్కొంది. కానీ వివరించలేదు.

Also Read: Mexico Supreme Court: మెక్సికో తొలి మహిళా సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ నార్మా లుసియా

ఈ ఘటనతో కొన్ని గంటలపాటు ఎయిర్‌పోర్టును మూసివేసి, ఆ తర్వాత తిరిగి తెరిచారు. అంతకుముందు 2022లో 26 ఏళ్ల బ్యాగేజీ హ్యాండ్లర్ జర్మనీ థాంప్సన్ ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ విమానం నుండి లగేజీని అన్‌లోడ్ చేస్తున్నప్పుడు న్యూ ఓర్లీన్స్‌లో మరణించాడు. థాంప్సన్ జుట్టు బెల్ట్ లోడర్ మెషీన్‌లో చిక్కుకుని అతను మృతి చెందాడు.

Exit mobile version