Explosion At Texas: అమెరికాలో ఘోర విషాదం.. మంటల్లో చిక్కుకుని 18,000 గోవులు సజీవ దహనం

వెస్ట్ టెక్సాస్‌లోని ఓ డెయిరీ ఫామ్‌లో భారీ పేలుడు (Explosion At Texas) సంభవించి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 18 వేల గోవులు 18,000 Cows) మృతి చెందినట్లు చెబుతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Explosion At Texas

Resizeimagesize (1280 X 720) (1)

వెస్ట్ టెక్సాస్‌లోని ఓ డెయిరీ ఫామ్‌లో భారీ పేలుడు (Explosion At Texas) సంభవించి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 18 వేల గోవులు 18,000 Cows) మృతి చెందినట్లు చెబుతున్నారు. ఈ రకమైన అతిపెద్ద సంఘటన ఇదే. టెక్సాస్ రాష్ట్రంలోని పాన్ హ్యాండిల్‌లో సోమవారం ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. ఇంతటి విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ప్రమాదంలో పశువులతో పాటు ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. టెక్సాస్‌లోని డిమిట్‌లోని సౌత్ ఫోర్క్ డైరీ ఫామ్‌లో సోమవారం మంటలు చెలరేగాయి. మంటలను అదుపు చేసేందుకు అధికారులు నానా తంటాలు పడాల్సి వచ్చింది.

పేలుడు చాలా విపరీతంగా ఉండటంతో ఆ ప్రాంతమంతా నల్లటి పొగ వ్యాపించింది. ఈ మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది గంటల తరబడి శ్రమించాల్సి వచ్చింది. ఈ దహనంలో 18000 పైగా ఆవులు చనిపోయాయని తరువాత తెలిసింది. యుఎస్‌లో ప్రతిరోజూ చంపే ఆవుల సంఖ్య కంటే ఇది దాదాపు మూడు రెట్లు ఎక్కువ.

మంటలను ఆర్పిన అనంతరం అగ్నిమాపక దళం మాట్లాడుతూ.. ఈ కాల్పుల్లో ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు. ఒక డెయిరీ ఫామ్ కార్మికుడు మంటల్లో చిక్కుకున్నాడు. అతడిని రక్షించాం. తీవ్రంగా కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరాడు. పేలుడు ఎలా మొదలైందో స్పష్టంగా తెలియరాలేదని పేర్కొన్నారు. అయితే, కౌంటీ జడ్జి మాండీ గెఫ్లర్ అది పరికరాల లోపం వల్ల జరిగి ఉండవచ్చని అనుమానించారు. USA టుడే ప్రకారం.. టెక్సాస్ అగ్నిమాపక అధికారులు కారణాన్ని పరిశీలిస్తారు.

Also Read: CM Yogi Adityanath: మాఫియాకు దడ పుట్టిస్తున్న యోగి..!

మంటల్లో పరుగెత్తిన చాలా ఆవులు హోల్‌స్టెయిన్, జెర్సీ ఆవుల మిశ్రమం. ఈ అగ్ని ప్రమాదంలో పొలంలోని 90 శాతం ఆవులు చనిపోయాయి. ఇదే సమయంలో వేలాది గోవులను టెక్సాస్ ప్రభుత్వం, అమెరికా డెయిరీ అధికారులు ఖననం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఒక అంచనా ప్రకారం.. ఒక ఆవు సగటు ధర 2000 డాలర్లు. పెద్ద శబ్ధం వినిపించిందని, కిలోమీటర్ల మేర పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నాయని స్థానికులు తెలిపారు. సమీపంలోని పట్టణాల నుంచి కిలోమీటర్ల మేర నల్లటి పొగ కూడా కనిపించింది. సౌత్ ఫోర్క్ డైరీ ఫామ్ క్యాస్ట్రో కౌంటీలో ఉంది. ఇది టెక్సాస్‌లోని అతిపెద్ద డైరీ ఉత్పత్తి చేసే కౌంటీలలో ఒకటి. టెక్సాస్ 2021 నివేదిక ప్రకారం.. కాస్ట్రో కౌంటీలో 30,000 కంటే ఎక్కువ పశువులు ఉన్నాయి.

  Last Updated: 14 Apr 2023, 06:37 AM IST