Site icon HashtagU Telugu

Unit 8200 : లెబనాన్‌లో పేజర్ పేలుళ్ల వెనుక ‘యూనిట్‌ 8200’.. ఏమిటిది ?

Unit 8200 Israel Secret Intelligence Hezbollah

Unit 8200 : లెబనాన్‌లోని హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థ కీలక నేతలు లక్ష్యంగా మంగళ, బుధవారాల్లో దాడులు జరిగాయి. మంగళవారం రోజు లెబనాన్‌లోని పలు ప్రాంతాల్లో పేజర్లు పేలాయి. బుధవారం రోజు వాకీటాకీలు, సోలార్ పరికరాలు పేలాయి. ఈ ఘటనల్లో 3200 మంది గాయపడగా.. 32 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పేలుళ్ల వెనుక ఇజ్రాయెల్‌కు చెందిన ‘యూనిట్‌ 8200’ హస్తం ఉందని కథనాలు వస్తున్నాయి. ‘యూనిట్‌ 8200’ను ‘యహిద షమోనే మతాయిమ్‌’ అనే పేరుతోనూ పిలుస్తారు. ఇజ్రాయెల్ ప్రధాన గూఢచార సంస్థ మోసాద్‌‌తో కలిసి ‘యూనిట్‌ 8200’(Unit 8200) ఈ పేలుళ్లకు పాల్పడిందని అంటున్నారు.

Also Read :India Vs US : భారత ప్రభుత్వానికి, అజిత్ దోవల్‌కు అమెరికా కోర్టు సమన్లు.. ఎందుకు ?

పేజర్లు, వాకీటాకీలు, సోలార్ పరికరాలు పేలుతుండటంతో లెబనాన్‌లోని హిజ్బుల్లా క్యాడర్‌లో దడ మొదలైంది. ఈ దాడులకు పాల్పడిన  ‘యూనిట్‌ 8200’పై అంతటా డిస్కషన్ నడుస్తోంది. ఇజ్రాయెల్‌లోని మిలటరీ ఇంటెలిజెన్స్‌ డైరెక్టరేట్‌లో 9900 యూనిట్‌, 504 యూనిట్‌తో పాటు దీన్ని కూడా ఏర్పాటు చేశారని చెబుతుంటారు. ఇజ్రాయెల్ శత్రుదేశాల నుంచి సమాచారాన్ని సేకరించడం, ఇజ్రాయెల్‌కు సైబర్ సెక్యూరిటీని అందించడం దీని విధి. సైబర్ సెక్యూరిటీ కోసం అవసరమైన అత్యాధునిక పరికరాలను ఈ విభాగం తయారుచేస్తుంటుంది. అమెరికాకు చెందిన నేషనల్‌ సెక్యూరిటీ ఏజెన్సీతో  కలిసి ‘యూనిట్‌ 8200’ గతంలో పలు దాడులు చేసిందని అంటున్నారు.

Also Read :Indian Students : భారత విద్యార్థులకు కెనడా బ్యాడ్ న్యూస్.. స్టడీ పర్మిట్లు తగ్గింపు

ఇజ్రాయెల్‌లో హైస్కూలు స్థాయిలో చురుకుగా మెరికల్లా ఉండే విద్యార్థులను ఎంపిక చేసి ‘యూనిట్‌ 8200’లో భర్తీ చేస్తుంటారు. అక్కడ వారికి సైబర్ సెక్యూరిటీ, సైబర్ దాడులపై అత్యాధునిక టెక్నాలజీతో ట్రైనింగ్ ఇస్తారు. ఈ యూనిట్‌లో పనిచేసి బయటకు వచ్చినవారికి  ఇజ్రాయెల్‌లోని హైటెక్‌ కంపెనీలు భారీ శాలరీలతో జాబ్స్  ఇస్తుంటాయి. యూనిట్ 8200 నేరుగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రికే రిపోర్ట్‌ చేస్తుంది. ఈ యూనిట్ కార్యకలాపాలు ఇజ్రాయెల్ బయట కూడా జరుగుతాయి. ఇరాన్‌ అణుకేంద్రంలోని సెంట్రీ ఫ్యూజ్‌లను ధ్వంసం చేసిన స్టక్స్‌నెట్‌‌ను యూనిట్8200 తయారు చేసిందే. హమాస్‌ గతేడాది అక్టోబర్‌ 7 ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. ఆ సమాచారాన్ని యూనిట్ 8200 గుర్తించలేకపోయింది. దీనికి బాధ్యత వహిస్తూ ఈ యూనిట్‌ అధిపతి యాసి సారల్‌ వారం క్రితమే రాజీనామా చేశారు.  ఆ వెంటనే లెబనాన్‌లో దాడులు మొదలయ్యాయి. బహుశా యూనిట్ 8200 కొత్త అధిపతి ఆర్డర్స్‌తో ఈ దాడులు జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.