Ukraine – EU : యూరోపియన్ యూనియన్(ఈయూ)లో సభ్యత్వం పొందే దిశగా ఉక్రెయిన్‌కు తలుపులు తెరుచుకున్నాయి. ఉక్రెయిన్‌తో సభ్యత్వ చర్చలను ప్రారంభించేందుకు ఈయూ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మిచెల్ అంగీకరించారు. గురువారం బ్రస్సెల్స్‌లో జరిగిన ఈయూ శిఖరాగ్ర సమావేశంలో యూరోపియన్ యూనియన్ నాయకులు ఈవిషయాన్ని ప్రకటించారు. ‘‘ఉక్రెయిన్ ప్రజలు ఒక ఆశతో ఐరోపా ఖండం వైపు చూస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు. మాల్దోవా దేశంతోనూ సభ్యత్వ చర్చలను ప్రారంభిస్తామని మిచెల్ వెల్లడించారు. జార్జియా దేశానికి ‘క్యాండిడేట్ స్టేటస్’ను కేటాయిస్తున్నట్లు చెప్పారు. అయితే ఉక్రెయిన్‌కు ఈయూ సభ్యత్వం ఇవ్వకూడదని హంగరీ ప్రభుత్వ ప్రతినిధి వాదన వినిపించారు. ఈయూ సదస్సు ఎజెండా నుంచి ఆ అంశాన్ని తొలగించాలని డిమాండ్ చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
- వాస్తవానికి ఉక్రెయిన్‌పై రష్యా ఆర్మీ దాడి చేసిన నాలుగు రోజుల తర్వాత (2022 ఫిబ్రవరి 28న) ఈయూ సభ్యత్వం కోసం ఉక్రెయిన్ అప్లై చేసుకుంది.
- అంటే ఈయూలో సభ్యత్వం కోసం ఉక్రెయిన్ ప్రయత్నాలను మొదలుపెట్టి దాదాపు రెండేళ్లు పూర్తయ్యాయి.
- 2022 జూన్ 23న ఉక్రెయిన్‌కు అభ్యర్థి హోదాను ఈయూ మంజూరు చేసింది.
- ఈయూ విస్తరణ ప్రణాళికపై ఈ ఏడాది నవంబరు 8న చర్చ జరిగింది. ఉక్రెయిన్‌తో సభ్యత్వ చర్చలను ప్రారంభించాలని ఈ మీటింగ్‌లోనే డిసైడ్ చేశారు.
- ఈయూలో చివరగా చేరిన దేశం క్రొయేషియా. దీన్ని ఈయూలో చేర్చుకునే ప్రక్రియ 2008లో మొదలవగా.. 2013లో ఈయూ సభ్యత్వం(Ukraine – EU) మంజూరైంది.
Also Read: Weather Today : బలంగా తుఫాను.. ఏపీ, తెలంగాణ వెదర్ రిపోర్ట్