ప్రపంచంలో చాలా దేశాలు తమ పౌరులకు కొన్ని ఉచిత సేవలు అందించడంలో ముందుంటాయి. కానీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) దేశం అక్కడి పౌరులకు కలల జీవితం నిజంగా ఇచ్చేలా సేవలు అందిస్తోంది. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరునికి ఆసుపత్రిలో జననం పూర్తిగా ఉచితంగా జరుగుతుంది. పిల్లల విద్య ప్రారంభం నుండి డిగ్రీ వరకు, ప్రాథమికం నుండి విశ్వవిద్యాలయం వరకు అంత పూర్తిగా ఉచితం. చదువు పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకోవాలంటే, ప్రభుత్వం రూ. 18 లక్షల మేరకు ఆర్థిక సహాయం చేస్తుంది. ఇవన్నీ పౌరుల జీవితం అభివృద్ధి చెందేందుకు చేసే అద్భుత చర్యలే!
Hanuman Pooja: ఎలాంటి పనులు చేసిన ఆటంకాలు ఎదురవుతున్నాయా.. అయితే ఆంజనేయస్వామిని ఇలా పూజించాల్సిందే!
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ దేశంలో ఆదాయంపై ఎటువంటి పన్నులు ఉండవు. మీరు సంపాదించేది మొత్తం మీదే! దీనితో పాటు, మీరు అనారోగ్యానికి గురైనా, ఆసుపత్రిలో చికిత్స పూర్తిగా ఉచితంగా జరుగుతుంది. మీరు ఒంటరిగా జీవిస్తూ సహాయానికి వ్యక్తిని అవసరం అనుకుంటే, ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా కేర్‌టేకర్‌ను ఏర్పాటు చేస్తుంది. అంటే జీవితం మొత్తాన్ని భద్రతతో, ఉచిత సేవలతో గడిపే అవకాశం కలుగుతుంది.
ఇవన్నీ కాకుండా మీరు మరణించిన తర్వాత కూడా ప్రభుత్వం ఖర్చుతో ఏసీ టెంట్లు వేసి అంత్యక్రియలు నిర్వహిస్తుంది. ఇలాంటి సదుపాయాలు విన్నప్పుడు మనకు నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. మన దేశంలో కూడా ఇలాంటి సంక్షేమ విధానాలు అమలులోకి వస్తే ఎంత మంచిదో అనిపిస్తుంది. మీరు కూడా ఇలాంటి కలల జీవితం గడపాలనుకుంటే, యూఏఈ తప్పనిసరిగా వెళ్లాల్సిందే.