Site icon HashtagU Telugu

Turkey Helicopter Crash: టర్కీలో హెలికాప్టర్ కూలి ఇద్దరు పైలట్లు మృతి

Turkey Helicopter Crash

Turkey Helicopter Crash

Turkey Helicopter Crash: టర్కీకి చెందిన హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మృతి చెందగా ఒక టెక్నీషియన్ గాయపడ్డారని అధికారులు తెలిపారు.

టర్కీలోని గజియాంటెప్ ప్రావిన్స్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.టర్కీ ఇంటీరియర్ మినిస్టర్ అలీ యెర్లికాయా మాట్లాడుతూ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ ఏవియేషన్ డిపార్ట్‌మెంట్ ఇన్వెంటరీలో నమోదైన ఛాపర్, నూర్దగి జిల్లాలోని కర్తాల్ గ్రామంలో కూలిపోయిందని తెలిపారు. దక్షిణ హటే ప్రావిన్స్ నుండి బయలుదేరిన హెలికాప్టర్‌ ఏటీసీతో సంబంధాలను కోల్పోయిందని రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది. హెలికాప్టర్‌ను చివరిసారిగా శనివారం అర్థరాత్రి స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10:49 గంటలకు సంప్రదించినట్లు మంత్రి తెలిపారు.

హెలికాప్టర్ కుప్పకూలడంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం మరియు వైద్య బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయం చర్యలు చేపట్టాయి. గాయపడిన టెక్నీషియన్‌ను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Also Read: Summer Health Tips: వేసవి నుండి మనల్ని మనం రక్షించుకోవాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే?