Site icon HashtagU Telugu

Plane Crash: మ‌రో విమాన ప్ర‌మాదం.. ఈసారి ఎక్క‌డంటే?

Plane Crash

Plane Crash

Plane Crash In Southern California: 2025 కొత్త సంవత్సరం మూడో రోజున విమాన ప్రమాదం (Plane Crash In Southern California) జరిగింది. ప్రతిరోజూ భూకంపాలు సంభవిస్తున్నట్లే.. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట విమాన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అజర్‌బైజాన్, దక్షిణ కొరియా తర్వాత ఇప్పుడు దక్షిణ కాలిఫోర్నియాలో విమాన ప్రమాదం సంభవించింది. ఒక చిన్న విమానం వాణిజ్య భవనం పైకప్పును ఢీకొట్టి కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్ద‌రు మృతి చెందగా, 18 మంది గాయపడ్డారు.

ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని విమానంలోని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ముందుగా భవనం కూలిపోయే ప్రమాదం ఉండడంతో సమీపంలోని కార్యాలయాలు, షోరూమ్‌లను ఖాళీ చేయించారు. కాలిఫోర్నియాలోని ఆరెంజ్ కౌంటీలోని ఫుల్లెర్టన్‌లో ఈ ప్రమాదం సంభవించింది. లాస్ ఏంజిల్స్‌కు ఆగ్నేయంగా 25 మైళ్లు (40 కిలోమీటర్లు) దూరంలో ఉంది.

Also Read: India vs Australia: తీరు మార్చుకొని టీమిండియా.. అవే చెత్త షాట్లు!

ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ వీడియో వైరల్‌గా మారింది

మీడియా నివేదికల ప్రకారం.. ఫుల్లెర్టన్ పోలీసు ప్రతినిధి క్రిస్టీ వెల్స్ ప్రమాదాన్ని ధృవీకరించారు. విమానాన్ని సింగిల్ ఇంజిన్ వ్యాన్ RV-10 అని గుర్తించినట్లు చెప్పారు. అయితే అది ఎక్కడ నుండి వచ్చింది? ఎక్కడికి వెళుతోంది? అనే వివ‌రాలు తెలియాల్సి ఉంది. గాయపడిన వ్యక్తులు విమానంలో ఉన్నారా లేదా భూమిపై ఉన్నారా అనేది తెలియరాలేదు. నగరంలోని రేమర్ అవెన్యూలోని 2300 బ్లాక్‌లో ఈ ప్రమాదం జరిగింది. సీసీటీవీ ఫుటేజీలో భవనం నుంచి పొగలు కమ్ముకున్నట్లు కనిపిస్తున్నాయి.

9 మంది క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్చగా, స్వల్పంగా గాయపడిన వారికి అక్కడికక్కడే చికిత్స అందించి ఇంటికి పంపించారు. డిస్నీల్యాండ్‌కు 6 మైళ్ల దూరంలో ఉన్న ఫుల్లెర్టన్ మున్సిపల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సాధారణ విమానయాన సేవలను అందించే ఈ విమానాశ్రయంలో ఒకే రన్‌వే, హెలిపోర్ట్ ఉన్నాయి. విమానాశ్రయం చుట్టూ నివాస ప్రాంతాలు, వాణిజ్య గోడౌన్లు, మెట్రోలింక్ రైలు మార్గంతో రద్దీగా ఉండే ప్రాంతంలో ఉంది.