Sheikh Hasina : షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన వెంటనే భారత్‌కు వచ్చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 5న ఆమె భారత్‌లో అడుగుపెట్టారు. నాటి నుంచి నేటివరకు బంగ్లాదేశ్‌లో ఎన్నో రాజకీయ మార్పులు జరిగాయి. షేక్ హసీనా సన్నిహితులపై కేసులు నమోదయ్యాయి. వారి అరెస్టులు జరిగాయి. హసీనాకు అనుకూలంగా వ్యవహరించిన జడ్జీల దగ్గరి నుంచి ఉన్నతాధికారుల దాకా పదవులను కోల్పోయారు. ఇప్పుడు భారత్‌లోని తమ దేశ రాయబార కార్యాలయం ప్రక్షాళనపై బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా బారత్‌లోని బంగ్లాదేశ్ హై కమిషన్ కార్యాలయంలో సేవలందిస్తున్న ఇద్దరు దౌత్యవేత్తలపై వేటు వేసింది. వారిని విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 17 నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. న్యూఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ ఫస్ట్ సెక్రెటరీ (ప్రెస్) షాబాన్ మహమూద్, కోల్‌కతాలోని బంగ్లాదేశ్ కాన్సులేట్ ఫస్ట్ సెక్రెటరీ (ప్రెస్) రంజన్ సేన్‌లను విధుల నుంచి డిస్మిస్ చేశారు. వెంటనే కార్యాలయాలను వదిలి వెళ్లాలని వారిని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. 2026 సంవత్సరం వరకు వారి కాంట్రాక్టు గడువు ఉన్నప్పటికీ.. అప్పటివరకు కొనసాగనిచ్చేది లేదని స్పష్టం చేసింది. గత షేక్ హసీనా(Sheikh Hasina) హయాంలో వీరిద్దరు నియమితులు కావడంతో ఈమేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.
We’re now on WhatsApp. Click to Join
షేక్ హసీనాపై మరిన్ని మర్డర్ కేసులు.. అందుకేనా ?
బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాపై తాజాగా మరో నాలుగు మర్డర్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు ఆమెపై నమోదైన మొత్తం మర్డర్ కేసుల సంఖ్య 44కు పెరిగింది. ఒకవేళ హసీనా బంగ్లాదేశ్‌కు తిరిగొచ్చినా చట్టపరమైన సమస్యలు ఎదురవుతాయని, ఆమెను జైలుకు పంపుతామనే సంకేతాలను ఇచ్చేందుకే ఇంత పెద్దసంఖ్యలో మర్డర్ కేసులను నమోదు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ప్రస్తుతానికి మధ్యంతర ప్రభుత్వానికి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహ్మద్ యూనుస్ బంగ్లాదేశ్ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్నప్పటికీ.. రానున్న కాలంలో హసీనా రాజకీయ విరోధి బేగం ఖలీదా జియా తెరపైకి వస్తారు. షేక్ హసీనా బంగ్లాదేశ్ వదిలి భారత్‌కు చేరుకోగానే.. బేగం ఖలీదా జియా విడుదలకు బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఆదేశాలివ్వడం, అందుకు అక్కడి ఆర్మీ చీఫ్ మద్దతు పలకడం గమనార్హం.