Site icon HashtagU Telugu

Top 10-Turnover Companies : ఆ విషయంలో వరల్డ్ టాప్ 10 కంపెనీలు ఇవే..

Top 10 Turnover Companies

Top 10 Turnover Companies

Top 10-Turnover Companies : టర్నోవర్.. బిజినెస్ ఏ రేంజ్ లో జరుగుతోందనే విషయాన్ని తెలిపే కొలమానం ఇది.. 

మన దేశంలో అత్యధిక టర్నోవర్ సాధిస్తున్న కంపెనీ ఏదో తెలుసా.. రిలయన్స్ ఇండస్ట్రీస్! 

ప్రపంచంలో అత్యధిక టర్నోవర్ సాధిస్తున్న కంపెనీ ఏదో తెలుసా..  వాల్ మార్ట్ !

Also read : Jaya Prada – Jail Sentence : జయప్రదకు ఆరు నెలల జైలుశిక్ష.. ఎందుకంటే..?

అమెరికాకు చెందిన వాల్ మార్ట్ ఏడాదికి 611 బిలియన్ డాలర్ల రెవెన్యూ సాధిస్తోంది. దీని తర్వాతి స్థానంలో.. అంటే సెకండ్ ప్లేస్ లో గూగుల్, ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్ లేవు.సౌదీ అరేబియాకు చెందిన ఆరామ్ కో ఉంది. ఆరామ్ కో కంపెనీ ముడి చమురును ఇతర దేశాలకు అమ్ముతుంటుంది. అందుకే దాని టర్నోవర్ ఆ రేంజ్ లో (604 బిలియన్ డాలర్లు) ఉంది. మూడో ప్లేస్ లో మనందరికీ పరిచయం ఉన్న అమెజాన్ ఉంది. ఈ లిస్టులో యాపిల్ కంపెనీ 8వ ప్లేస్ లో ఉంది. చైనాకు చెందిన పెట్రో చైనా కంపెనీ 5వ ప్లేస్ లో ఉంది. ఈ కంపెనీ చైనా ప్రభుత్వం కోసం ఆఫ్రికా, ఆసియా దేశాల్లో చాలాచోట్ల పెట్రోల్ బావులను కొనుగోలు చేసి నిర్వహిస్తోంది. ప్రపంచ ఆయిల్ మార్కెట్ పై పట్టు కోసం చైనా కమ్యూనిస్టు సర్కారు .. పెట్రో చైనా కంపెనీని నడిపిస్తోంది.  ఇదే లిస్టులో స్టేట్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ చైనా 9వ ప్లేస్ లో ఉంది. దీని  టర్నోవర్  384 బిలియన్ డాలర్లుగా(Top 10-Turnover Companies) ఉంది. ఈ వివరాలను స్టాటిస్టా కంపెనీ డేటాబేస్ వెల్లడించింది.   

టర్నోవర్ లో టాప్ 10 కంపెనీలు 

  • వాల్ మార్ట్ – రీటెయిల్ – 611 బిలియన్ డాలర్లు
  • సౌదీ ఆరామ్ కో – ఆయిల్ అండ్ గ్యాస్ – 604 బిలియన్ డాలర్లు
  • అమెజాన్ – ఈ కామర్స్ – 514 బిలియన్ డాలర్లు
  • విటోల్ – ఆయిల్ అండ్ గ్యాస్ – 505 బిలియన్ డాలర్లు
  • పెట్రో చైనా – ఆయిల్ అండ్ గ్యాస్ – 502 బిలియన్ డాలర్లు
  • సీఎన్పీసీ – ఆయిల్ అండ్ గ్యాస్ – 474 బిలియన్ డాలర్లు
  • ఎక్సాన్ మొబిల్ – ఆయిల్ అండ్ గ్యాస్ – 399 బిలియన్ డాలర్లు
  • యాపిల్ – టెక్నాలజీ – 394 బిలియన్ డాలర్లు
  • స్టేట్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ చైనా – 384 బిలియన్ డాలర్లు
  • షెల్ – ఆయిల్ అండ్ గ్యాస్ – 381 బిలియన్ డాలర్లు