Donald Trump Swearing In : కాసేపట్లో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్.. ప్రమాణ స్వీకారోత్సవం జరిగేది ఇలా

రెండోసారి అధ్యక్ష హోదాలో(Donald Trump Swearing In) దేశ ప్రజలను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగిస్తారు.

Published By: HashtagU Telugu Desk
Donald Trump Swearing In Washington White House

Donald Trump Swearing In : డొనాల్డ్ ట్రంప్ కాసేపట్లో అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు. మన దేశ టైం ప్రకారం ఇవాళ (సోమవారం) ఉదయం 10.30 గంటలకు వాషింగ్టన్‌లోని క్యాపిటల్ భవనంలో ట్రంప్  ప్రమాణం చేస్తారు. చలి ఎక్కువగా ఉన్నందున క్యాపిటల్ భవనం లోపల ఉండే రోటుండా సముదాయంలో ప్రమాణ స్వీకారోత్సవాలను నిర్వహిస్తున్నారు.ఈక్రమంలో వాషింగ్టన్‌లోని క్యాపిటల్ భవనం వరకు డొనాల్డ్ ట్రంప్ ర్యాలీగా చేరుకుంటారు. తొలుత న్యూయార్క్ ఆర్చ్ బిషప్ టిమోథీ కార్డినల్ డోలన్, క్రైస్తవ మత ప్రచారకుడు  ఫ్రాంక్లిన్ గ్రాహం ప్రసంగిస్తారు. క్రిస్టోఫర్ మాచియో అనే గాయకుడు “Oh, America!” గీతాన్ని ఆలపిస్తారు. అనంతరం దేశ ఉపాధ్యక్షుడిగా తెలుగింటి అల్లుడు జేడీ వాన్స్‌తో అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బ్రెట్ కవానా ప్రమాణం చేయిస్తారు. తదుపరిగా ట్రంప్‌తో అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ దేశాధ్యక్షుడిగా ప్రమాణం చేయిస్తారు. రెండోసారి అధ్యక్ష హోదాలో(Donald Trump Swearing In) దేశ ప్రజలను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగిస్తారు. ఈసారి అమెరికా అధ్యక్షుడి ప్రమాణస్వీకార కార్యక్రమం నినాదం ఏమిటంటే.. ‘‘మా సుస్థిర ప్రజాస్వామ్యం.. ఒక రాజ్యాంగ వాగ్దానం’’(Our Enduring Democracy: A Constitutional Promise).

Also Read :Lokesh Deputy CM Post : కూటమిలో ఏంజరగబోతుంది..?

బైడెన్, కమలకు గౌరవ వీడ్కోలు

ట్రంప్ ప్రసంగించిన అనంతరం ఇప్పటివరకు అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల్లో సేవలు అందించిన జో బైడెన్, కమలా హ్యారిస్‌లకు గౌరవ వీడ్కోలు పలుకుతారు. తదుపరిగా సంతకాలు చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగా నామినేషన్లు, మెమొరాండంలు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై నూతన అధ్యక్షుడు సంతకాలు చేస్తారు. ఇక  క్యాపిటల్ భవనంలోనే నూతన అధ్యక్షుడితో కలిసి ప్రముఖులంతా మధ్యాహ్న భోజనం చేస్తారు.

Also Read :World Economic Forum Annual Meeting : అందరి చూపు ‘దావోస్’ పైనే

మధ్యాహ్న భోజనం పూర్తయ్యాక..

మధ్యాహ్న భోజనం పూర్తయ్యాక నూతన అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు కలిసి అమెరికా సైనిక బలగాల ప్రదర్శనలు, ప్రెసిడెన్షియల్ పరేడ్‌లను తిలకిస్తారు.  అమెరికన్ మ్యూజిక్ ఐకాన్ కేరీ అండర్ వుడ్ సంగీత కచేరీ చేయనున్నారు. ఈసారి ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవ ఖర్చుల కోసం దాదాపు రూ.1,400 కోట్ల విరాళాలను సేకరించారు. దీనికి బెజోస్, జుకర్ బర్గ్, ఉబెర్ సీఈఓ ఖోస్రోషాహీ చెరో రూ.8.65 కోట్లను విరాళంగా ఇచ్చారు.

  Last Updated: 20 Jan 2025, 08:24 AM IST